మహిళా సహకార నాగరిక్ బ్యాంక్ లిమిటెడ్, భరూచ్, గుజరాత్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
మహిళా సహకార నాగరిక్ బ్యాంక్ లిమిటెడ్, భరూచ్, గుజరాత్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు
‘ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల (UCB’s) ద్వారా ఇతర బ్యాంకులలో డిపాజిట్ల (నిల్వల) జమ’ మరియు ‘మీ ఖాతాదారును తెలుసుకోండి (KYC)’ కి సంబంధించి ఆర్బీఐ రూపొందించిన మార్గనిర్ధేశాలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A (1)(c) తో పాటు 46 (4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా సెప్టెంబర్ 18, 2023 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా మహిళా సహకార నాగరిక్ బ్యాంక్ లిమిటెడ్, భరూచ్, గుజరాత్ (బ్యాంక్) వారి పై ₹2 లక్షలు (రెండు లక్షల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది. ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి లావాదేవిలతో గానీ, ఒప్పందాల చెల్లుబాటు విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు. నేపథ్యం: మార్చి 31, 2022 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి ఆర్బిఐ చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది. ఈ తనిఖీలో భాగంగా రిస్క్ అంచనా నివేదిక మరియు దానికి సంబంధించిన అన్ని ప్రత్యుత్తరాల సమగ్ర పరిశీలన ద్వారా వెల్లడైన అంశాలు (i) ఇంటర్-బ్యాంక్ స్థూల ఎక్స్పోజర్ పరిమితి మరియు ఇంటర్-బ్యాంక్ కౌంటర్ పార్టీ ఎక్స్పోజర్ పరిమితి ఉల్లంఘన, (ii) నిర్దేశిత ఆవర్తన సమయానుగునంగ రిస్క్ ఖాతాల వర్గీకరణపై సమీక్ష నిర్వహించబడలేదు. కావున ఆర్బిఐ రూపొందించిన విదివిధానాలు, నిర్దేశాలకనుగునంగ అనుసరించుటలో వైఫల్యం కారణంగా బ్యాంకు పై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది. భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటీసుకు బ్యాంకు వారి వివరణ పరిశీలించిన తరువాత, మరియు బ్యాంకుతో సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ పరిగణించిన పిమ్మట, లోగడ పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలను అనుసరించుటలో లోపాలకు గాను ఆర్బిఐ విధించిన నగదు జరిమానా సరియైనది, సహేతుకమైనదిగా నిర్ధారించడమైనది.
(యోగీష్ దయాళ్) ముఖ్య నిర్వహణ అధికారి పత్రికా విడుదల: 2023-2024/1140 |