<font face="mangal" size="3">మెహసానా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెĶ - ఆర్‌బిఐ - Reserve Bank of India
మెహసానా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్, మెహసానా (గుజరాత్)పై భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా ద్రవ్య జరిమానా విధింపు
తేది: 27/03/2023 మెహసానా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్, మెహసానా (గుజరాత్)పై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) మార్చ్ 24, 2023 నాటి ఆదేశం ద్వారా, మెహసానా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్, మెహసానా (గుజరాత్) (ది బ్యాంకు) పై ₹2.10 లక్షలు (రూ. రెండు లక్షల పది వేలు మాత్రమే) జరిమానా విధించింది. ఆర్‌బిఐ జారీ చేసిన ‘మీ వినియోగదారుని తెలుసుకోండి (KYC) ఆదేశాలు, 2016' లోని కొన్ని నిబంధనల ఉల్లంఘనకు మరియు ‘సహకార బ్యాంకుల ద్వారా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల (CICలు) సభ్యత్వం’పై ఆర్‌బిఐ జారీ చేసిన నిబంధనల ఉల్లంఘనకు ఈ జరీమానా విధించబడింది. ఆర్‌బిఐ జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని మరియు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ (రెగ్యులేషన్స్) చట్టం 2005 యొక్క సెక్షన్ 23 (4) తో కలుపుకొని సెక్షన్ 25 (1) (iii) క్రింద ఈ జరిమానా విధించబడింది. ఈ చర్య నియంత్రణ అనుపాలనల లోపాలపై ఆధారపడి తీసుకున్నదే తప్ప, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా ఉద్దేశించబడలేదు. నేపధ్యము జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంకు (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్-NABARD) మార్చి 31, 2022 నాటి బ్యాంక్ ఆర్థిక స్థితికి సంబంధించి నిర్వహించిన చట్టబద్ధమైన తనిఖీ, మిగతా వాటితో సహా, దానికి సంబంధించిన అన్ని సంబంధిత ఉత్తర ప్రత్యుత్తరాల పరిశీలనలో, (i) రిస్క్ వర్గీకరణ మరియు ఇప్పటికే ఉన్న కస్టమర్‌ల యొక్క KYC పత్రాల కాలానుగుణ నవీకరణలను సమీక్షించే వ్యవస్థ లేదని; (ii) మార్చి 31, 2022 నాటికి మూడు CICలకు డేటాను (చారిత్రాత్మక డేటాతో సహా) ఆర్‌బిఐ జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలకు విరుద్ధంగా సమర్పించిందని వెల్లడైంది. దీని ఆధారంగా, ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంకుకు నోటీసు జారీ చేయబడింది. జారీ చేసిన నోటీసుకు బ్యాంక్ యొక్క ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని మౌఖిక సమర్పణ అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత, ఈ విషయంలో ఆర్‌బిఐ జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో ఉల్లంఘన వాస్తవమని మరియు జరిమానా విధించదగినదిగా, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది (యోగేష్ దయాల్) పత్రికా ప్రకటన: 2022-2023/1923 |