ది మెహసనా నాగరిక్ సహకారి పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్,మెహసానా, గుజరాత్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు. - ఆర్బిఐ - Reserve Bank of India
ది మెహసనా నాగరిక్ సహకారి పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్,మెహసానా, గుజరాత్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు.
పట్టణ సహకార బ్యాంకులు తమ డిపాజిట్లను ఇతర బ్యాంకులలో పెట్టేటప్పుడు, భారతీయ రిజర్వు బ్యాంకు, “సహకార బ్యాంకులు – డిపాజిట్లు వడ్డిరేట్లు, ” అనే అంశాల మీద ఇచ్చిన నిబంధనలు -2016 ను ఉల్లంఘించి నందుకు, పట్టణ సహకార బ్యాంకుల లో తమ డైరెక్టర్లకు ఇవ్వదలచిన రుణాల విషయములోను , డైరెక్టర్లు హామిదారులుగా/ ష్యూరిటి దారులుగా వున్నప్పుడు పాటించవలసిన నిబంధనలను ఉల్లంఘించి నందులకు,మరియు వారికి వారి బంధువులకు లాభము చేకుర్చే సంస్థలకు/కంపెనీలకు రుణాలు ఇచ్చేటప్పుడు, “తమ డైరెక్టర్లకు ఇవ్వదలచిన రుణాల విషయములోను , డైరెక్టర్లు హామిదారులుగా/ ష్యూరిటి దారులుగా వున్నప్పుడు పాటించవలసిన నిబంధనలు-వివరణ ను ఉల్లంఘించినందుకు మరియు బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 26 A,(సెక్షన్ 56 తో కలిపి చదువుకొనేది) ని ఉల్లంఘించినందుకు ది మెహసనా నాగరిక్ సహకారి బ్యాంకు లిమిటెడ్,మెహసానా, గుజరాత్ పై, భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేది 29 డిసెంబర్ ,2023 ద్వారా ఆర్ధిక రు.7.00 లక్షలు ( అక్షరాల ఏడు లక్షల రూపాయలు మాత్రమె ) ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)( ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది చట్టబద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరుబ్యాంకు తమఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదే వీల ప్రామాణికతలకు సంబంధించినది కాదు . నేపధ్యము ఈ బ్యాంకు యొక్క 31-03-2022 తేది నాటి ఆర్ధిక పరిస్థితి ప్రామాణికముగా రిజర్వు బ్యాంకు వారు చట్ట బద్ధ తనిఖీ నిర్వహించారు .ఆ తనిఖీ నివేదికను,ముప్పు(రిస్క్) అంచనాల నివేదిక మరియు తత్సంబంధిత పత్రములను పరిశీలించిన మీదట బహిర్గతమైన అంశాలు:i) బ్యాంకు డైరెక్టరు బంధువు హామీ పై ఋణము మంజూరు చేయుట ii) కాలపరిమితి ముగిసిన డిపాజిట్లపై కాల పరిమితి ముగిసిన నాటి నుండి డిపాజిట్ చెల్లించే తేది వరకు ఆమోద యోగ్యమైన వడ్డీ రేటు ప్రకారము వడ్డీ చెల్లించక పోవుట iii) ) నిబంధనల ప్రకారము పంపవలసిన డబ్బును “ఖాతాదారుల విద్య మరియు అవగాహన నిధికి(DEAF) పంపకపోవుట. తదనుగుణంగా,పైన పొందుపరచిన అవకతవకలు జరిగినందులకు గాను, భారతీయ రిజర్వు బ్యాంకు ఆదేశాలు పాటించనందులకుగాను ఈ బ్యాంకుపై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వ వలసినదిగా బ్యాంకు కు నోటీసు ఇవ్వడమైనది. ఈ బ్యాంకు సమర్పించిన వివరణ పరిశీలించిన మీదట, వ్యక్తిగత మౌఖిక విచారణ లో వాదన విన్నమీదట,రిజర్వు బ్యాంకు వారు సూచించిన చట్టబధ్దమైన ఆదేశాల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించుకుని ఈ బ్యాంకు పై ఆర్ధిక పరమైన జరిమానాను విధించడమైనది. యోగేష్ దయాళ్ చీఫ్ జనరల్ మేనేజర్ పత్రికా ప్రకటన: 2023-2024/1700 |