RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

109949925

మూల సహకారి బ్యాంక్ లిమిటెడ్, సోనాయి, అహ్మెద్ నగర్ జిల్లా, మహారాష్ట్ర వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

‘ఎక్స్పొజర్ నిబంధనలు మరియు చట్టబద్ధ/ఇతర నియంత్రణలు-(UCBs)’ కు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన నిబంధనలను ఉల్లంఘించినందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా జనవరి 08, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా మూల సహకారి బ్యాంక్ లిమిటెడ్, సోనాయి, అహ్మెద్ నగర్ జిల్లా (బ్యాంక్) వారి పై ₹50,000/-(యాభై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన మరే ఇతర లావాదేవిలతో గానీ, ఒప్పందాల చెల్లుబాటు విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు.

నేపథ్యం:

మార్చి 31, 2022 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి ఆర్బిఐ చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది.  ఈ చర్యలో భాగంగా తనిఖీ నివేదిక, రిస్క్ అంచనా నివేదిక మరియు దానికి సంబంధించిన అన్ని ప్రత్యుత్తరాల సమగ్ర పరిశీలన ద్వారా ఇంటర్-బ్యాంక్ కౌంటర్ పార్టీ ఎక్స్పోజర్ పరిమితి ఉల్లంఘన వెల్లడైంది, కావున ఆర్బిఐ రూపొందించిన విదివిధానాలను అనుసరించుటలో వైఫల్యం కారణంగా బ్యాంకు పై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది.

భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటీసుకు బ్యాంకు వారి వివరణ పరిశీలించిన తరువాత, మరియు బ్యాంకుతో సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ పరిగణించిన పిమ్మట, పైన పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలను అనుసరించుటలో లోపాలకు గాను ఆర్బిఐ విధించిన నగదు జరిమానా సరియైనది, సహేతుకమైనదిగా నిర్ధారించడమైనది.

                                                                            యోగేష్ దయాల్

చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా  ప్రకటన:2023-2024/1759

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?