నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, బాబ్రా, గుజరాత్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, బాబ్రా, గుజరాత్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (BR Act) సెక్షన్ 26 A (2) ఉల్లంఘనకు మరియు ‘డైరెక్టర్లకు, బంధువులకు, వారికి సంబంధించిన వ్యాపార సంస్థలకు ఋణాలు మరియు అడ్వాన్సులు’ ‘ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల UCB’s ద్వారా ఇతర బ్యాంకులలో డిపాజిట్ల జమ’ మరియు ‘సహకార బ్యాంకులు –నగదు నిల్వపై వడ్డీ రేటు’ కు సంబంధించి ఆర్బీఐ రూపొందించిన మార్గనిర్ధేశాలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A (1)(c) తో పాటు 46 (4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా సెప్టెంబర్ 18, 2023 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, బాబ్రా, గుజరాత్ (బ్యాంకు) వారి పై ₹2 లక్షలు (రెండు లక్షల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది. ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి లావాదేవిలతో గానీ, ఒప్పందాల చెల్లుబాటు విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు. నేపథ్యం: మార్చి 31, 2022 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి ఆర్బిఐ చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది. ఈ చర్యలో భాగంగా తనిఖీ నివేదిక, రిస్క్ అంచనా నివేదిక మరియు దానికి సంబంధించిన అన్ని ప్రత్యుత్తరాల సమగ్ర పరిశీలన ద్వారా వెల్లడైన అంశాలు (i) డిపాజిటర్ల విద్య మరియు అవగాహన నిధికి యోగ్యమైన అర్హత మొత్తాన్ని బదిలీ చేయలేదు (ii) బ్యాంకు డైరెక్టర్లలో ఒకరి బంధువు హామీగా ఉండడం వలన ఒక వ్యక్తికి ఋణ సౌకర్యం కల్పించబడింది. (iii) ప్రుడెన్షియల్ ఇంటర్-బ్యాంక్ స్థూల ఎక్స్పోజర్ పరిమితి ఉల్లంఘన (iv) ప్రుడెన్షియల్ ఇంటర్-బ్యాంక్ కౌంటర్ పార్టీ స్థూల ఎక్స్పోజర్ పరిమితి ఉల్లంఘన, మరియు (v) బ్యాంకు వద్దనుండి క్లెయిమ్ చేయని కాల పరిమితి దాటిన టర్మ్ డిపాజిట్లపై ఎటువంటి వడ్డీని చెల్లించలేదు. కావున ఆర్బిఐ రూపొందించిన విదివిధానాలను అనుసరించుటలో వైఫల్యం కారణంగా బ్యాంకు పై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది. భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటీసుకు బ్యాంకు వారి వివరణ పరిశీలించిన తరువాత, మరియు బ్యాంకుతో సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ పరిగణించిన తరువాత, లోగడ పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలను అనుసరించుటలో లోపాలకు గాను ఆర్బిఐ విధించిన నగదు జరిమానా సరియైనది, సహేతుకమైనదిగా నిర్ధారించడమైనది.
(యోగీష్ దయాళ్) ముఖ్య నిర్వహణ అధికారి పత్రికా విడుదల: 2023-2024/1120 |