నాగనాథ్ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్, హింగోలి, మహారాష్ట్ర వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య జరిమానా విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
నాగనాథ్ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్, హింగోలి, మహారాష్ట్ర వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య జరిమానా విధింపు
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం నందలి సెక్షన్ 26A తో పాటు సెక్షన్ 56 లకు విరుద్ధంగా వ్యవరించినందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం-1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా జులై 26, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా నాగనాథ్ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్, హింగోలి, మహారాష్ట్ర, (బ్యాంక్), వారి పై రూ. ₹1.00 లక్ష (ఒక లక్ష రూపాయలు) ద్రవ్య జరిమానా విధించడమైనది. మార్చి 31, 2023 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి ఆర్బిఐ చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది. ఈ తనిఖీ పర్యవేక్షణ లో భాగంగా ఆర్బీఐ రూపొందించిన మార్గదర్శకాలను అనుసరించుటలో వైఫల్యనికి బ్యాంకు పై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది. భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటీసుకు బ్యాంకు వారి వివరణ పొందిన తరువాత, మరియు బ్యాంకుతో సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ పరిగణించిన పిమ్మట, బ్యాంకు నిర్దిష్ట కాలపరిమితి లోపల అర్హమైన రొక్కo మొత్తాన్ని వినియోగదారుల శిక్షణ మరియు అవగాహనా నిధికి బదిలీ చేయలేదన్న అభియోగం నిజమని వెల్లడైనందున బ్యాంకు పై విధించిన నగదు జరిమానా సరియైనది, సహేతుకమైనదిగా నిర్ధారించడమైనది. ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి ఇతర ఒప్పందాల చెల్లుబాటుకు గానీ లేదా లావాదేవిల విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు, అంతేగాక ఈ ద్రవ్య పెనాల్టీని విధించడం వలన బ్యాంకు పై ఆర్బీఐ చేపట్టే ఇతర చర్యలపై ఎటువంటి పక్షపాతం వహించదు.
(పునీత్ పంచోలి) పత్రికా విడుదల: 2024-2025/817 |