RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

133502599

నిధి సహకార బ్యాంక్ లిమిటెడ్, అహ్మదాబాద్, గుజరాత్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య జరిమానా విధింపు

‘డైరెక్టర్లకు, బంధువులకు, వారికి సంబంధించిన వ్యాపార సంస్థలకు ఋణాలు మరియు అడ్వాన్సులు’ లకు సంబంధించి ఆర్బీఐ రూపొందించిన నిర్దిష్ట మార్గనిర్ధేశాలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా ఆగస్ట్ 5, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా నిధి సహకార బ్యాంక్ లిమిటెడ్, అహ్మదాబాద్, గుజరాత్, (బ్యాంకు) వారి పై రూ.

₹50 వేలు (యాభై వేల రూపాయలు) ద్రవ్య జరిమానా విధించడమైనది.మార్చి 31, 2023 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి ఆర్బిఐ చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది. ఈ పర్యవేక్షణ లో భాగంగా ఆర్బీఐ రూపొందించిన మార్గదర్శకాలను అనుసరించుటలో వైఫల్యనికి బ్యాంకు పై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది. భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటీసుకు బ్యాంకు వారి వివరణ పొందిన తరువాత, మరియు బ్యాంకుతో సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ పరిగణించిన పిమ్మట, అలాగే బ్యాంకు సమర్పించిన అదనపు సమాచారం పరిశీలించిన పిదపబ్యాంకు, డైరెక్టర్ల బంధువులు హామీదారులుగా రుణాలను మంజూరు చేసిందన్న అభియోగం నిజమని ఆర్బిఐ గుర్తించినందున బ్యాంకు పై విధించిన నగదు జరిమానా యోగ్యమైనది, సహేతుకమైనదిగా నిర్ధారించడమైనది.

ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి ఇతర ఒప్పందాల చెల్లుబాటు లేదా లావాదేవిల విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు, అంతేగాక ఈ ద్రవ్య పెనాల్టీని విధించడం వలన బ్యాంకు పై ఆర్బీఐ చేపట్టే ఇతర చర్యలపై ఎటువంటి పక్షపాతం వహించదు.

(పునీత్ పంచోలి)    
ముఖ్య కార్యనిర్వహణాధికారి

పత్రికా విడుదల: 2024-2025/856

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?