RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

128918674

ఒడిష గ్రామ్య బ్యాంక్, ఒడిష, వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

ప్రుడెన్షియల్ నిబంధనలను బలోపేతం చేయడం - ప్రొవిజనింగ్, ఆస్థి వర్గీకరణ మరియు ఎక్స్‌పోజర్ పరిమితి’ మరియు ‘ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు - ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ మరియు ప్రొవిజనింగ్ నిబంధనలు’-నిరర్థక ఆస్తులు (NPAs)’ కు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన నిర్దిష్ట నిబంధనలను పాటించనందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు సెక్షన్ 51(1) ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా ఏప్రిల్ 09, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా ఒడిష గ్రామ్య బ్యాంక్, (బ్యాంక్) వారి పై ₹1,50,000/-(లక్ష యాభై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.మార్చి 31, 2023 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది.

ఈ పర్యవేక్షణ ఫలితంగా, ఆర్బీఐ రూపొందించిన మార్గదర్శకాలను అనుసరించుటలో వైఫల్యం కారణంగా, ఇట్టి విషయమై సంబంధిత ఉత్తరప్రత్యుత్తరాలు జరిపిన పిమ్మట బ్యాంకు పై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది.నోటీసుకు స్పందనగా బ్యాంకు వారి వివరణ పరిశీలించిన తరువాత, మరియు బ్యాంకుతో సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ పరిగణించిన పిమ్మట, అలాగే బ్యాంకు సమర్పించిన అదనపు సమాచారం ఆధారంగా నిర్దిష్ట ఋణ ఖాతాలను NPAలు గా వర్గీకరించడంలో వైఫల్యం ఫలితంగా రుణ ఖాతాల ఆస్తి వర్గీకరణలో తేడా ఏర్పడిందన్న విషయం ఋజువైనందున సదరు బ్యాంకుపై ఆర్బీఐ నగదు జరిమానా విధింపు చర్య చేపట్టవలసివచ్చినది.

ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి ఇతర ఒప్పందాల చెల్లుబాటు లేదా లావాదేవిల విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు, అంతేగాక ఇట్టి నగదు జరిమానా బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను ఉల్లంఘించినందున తీసుకున్న చర్య మాత్రమే, కావున బ్యాంకు పై చేపట్టే ఏ ఇతర చర్యలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎటువంటి పక్షపాతం వహించదు.

 

(యోగేష్ దయాల్)
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2024-2025/254

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?