<font face="mangal" size="3">ఉస్మానాబాద్ జనతా సహకరి బ్యాంక్ లిమిటెడ్, ఉసĺ - ఆర్బిఐ - Reserve Bank of India
ఉస్మానాబాద్ జనతా సహకరి బ్యాంక్ లిమిటెడ్, ఉస్మానాబాద్ (మహారాష్ట్ర) పై భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య జరిమానా విధింపు
ఫిబ్రవరి 20, 2023 ఉస్మానాబాద్ జనతా సహకరి బ్యాంక్ లిమిటెడ్, ఉస్మానాబాద్ (మహారాష్ట్ర) పై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ఫిబ్రవరి 14, 2023 నాటి తమ ఉత్తర్వు ద్వారా ‘బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (‘చట్టం’) మరియు డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ స్కీమ్, 2014 (‘స్కీం’)’ విషయాలపై RBI జారీ చేసిన ఆదేశాలను పాటించనందులకు/ ఉల్లంఘించినందులకు, ఉస్మానాబాద్ జనతా సహకరి బ్యాంక్ లిమిటెడ్, ఉస్మానాబాద్ (మహారాష్ట్ర)(‘బ్యాంక్’) పై ₹1.50 లక్షల (ఒక లక్ష యాభై వేల రూపాయిలు మాత్రమే) జరిమానా విధించింది. RBI జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, ‘చట్టం’ లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకొని RBI ద్వారా ఈ జరిమానా విధించబడింది. ఈ చర్య నియంత్రణ అనుపాలన లోని లోపాలపై ఆధారపడి తీసుకున్నదే గాని, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే వొక అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు. నేపథ్యo మార్చి 31, 2021 తేదీనాటి బ్యాంక్ ఆర్థిక స్థితి ఆధారిత రిస్క్ అసెస్మెంట్ రిపోర్ట్ ద్వారా, మిగతావాటితోపాటు, అర్హతగల క్లెయిమ్ చేయని నిర్దిష్ట ఖాతాలలోని నిల్వలను బ్యాంక్, ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్’ కు బదిలీ చేయలేదని వెల్లడైంది. దీని ఆధారంగా, ‘చట్టం’ లో పేర్కొన్న నిబంధనలను మరియు ‘చట్టం’ క్రింద ఇవ్వబడిన ఆదేశాలను ఉల్లంఘించినందులకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంక్ కు వొక నోటీసు జారీ చేయబడింది. బ్యాంక్ సమర్పించిన ప్రత్యుత్తరములు మరియు వ్యక్తిగత విచారణ సమయంలో చేసిన మౌఖిక సమర్పణలను పరిగణనలోకి తీసుకున్నతదుపరి, ఈ విషయంలో బ్యాంక్ ద్వారా RBI ఆదేశాల ఉల్లంఘన జరిగిందని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు వొక నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2022-2023/1752 |