<font face="mangal" size="3px">పూణే పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, &# - ఆర్బిఐ - Reserve Bank of India
పూణే పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పూణే పై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ద్రవ్య జరిమానా విధింపు
ఫిబ్రవరి 20, 2023 పూణే పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పూణే పై భారతీయ భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ఫిబ్రవరి 14, 2023 నాటి తమ ఉత్తర్వు ద్వారా, డిపాజిట్ల వడ్డీ రేటుపై RBI జారీ చేసిన ఆదేశాలను పాటించడంలో విఫలమైన దృష్ట్యా పూణే పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పూణే (‘బ్యాంక్’) పై ₹1.00 లక్ష (ఒక లక్ష రూపాయలు మాత్రమే) ద్రవ్య జరిమానా విధించింది. RBI జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని RBI ద్వారా ఈ జరిమానా విధింపబడింది. ఈ చర్య నియంత్రణ అనుపాలన లోని లోపాలపై ఆధారపడి తీసుకున్నదే గాని, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే వొక అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు. నేపథ్యo బ్యాంక్ యొక్క మార్చి 31, 2021 నాటి ఆర్థిక స్థితి ఆధారంగా చేపట్టిన రిస్క్ అసెస్‌మెంట్ రిపోర్ట్ పరిశీలనలో, మిగతా విషయాలతో పాటు, డిపాజిటర్ మరణించిన తేదీ నుండి క్లెయిమ్‌దారు(ల)కి తిరిగి చెల్లించే తేదీ వరకు మరణించిన వ్యక్తిగత డిపాజిటర్లు/ ఏకైక యాజమాన్యం (సోల్-ప్రోప్రైటర్షిప్) యొక్క కరెంట్ ఖాతాలలో ఉన్న బ్యాలెన్స్ మొత్తానికి బ్యాంక్ వడ్డీని చెల్లించలేదని వెల్లడి చేయబడింది. దీని ఆధారంతో, పైన ఉటంకించిన RBI ఆదేశాలను ఉల్లంఘించినందుల కు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంక్ కు వొక నోటీసు జారీ చేయబడింది. షోకాజ్ నోటీసుకు బ్యాంక్ వ్రాతపూర్వక సమాధానం మరియు వ్యక్తిగత విచారణ సమయంలో చేసిన మౌఖిక సమర్పణలను పరిగణనలోకి తీసుకున్నతదుపరి, బ్యాంక్ RBI ఆదేశాలను పాటించడం లేదని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు వొక నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2022-2023/1755 |