RBI imposes monetary penalty on Pusad Urban Co-operative Bank Ltd., Pusad, Maharashtra
పట్టణ సహకార బ్యాంకులలో సూపర్వైజరీ ఏక్షన్ ఫ్రేమ్ వర్క్ కు సంబంధించి, భారతీయ రిజర్వు బ్యాంకు ఇచ్చిన నిర్దేశిత ఆదేశాలను ఉల్లంఘించినందులకుగాను పుసద్ పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్, పుసద్, మహారాష్ట్ర పై భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేదీ 28 జూన్ 2024 ద్వారా రు.2. 50 లక్షల(అక్షరాల రెండు లక్షల ఏభై వేల రూపాయలు మాత్రమే) ఆర్ధిక జరిమానా విధించడమైనది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)( ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన . రిజర్వు బ్యాంకు ఇచ్చిన నిర్దేశిత ఆదేశాలను ఉల్లంఘించి భారతీయ స్టేట్ బ్యాంకు వారు ఇచ్చే వడ్డీ రేట్ల కంటే తమ బ్యాంకు డిపాజిట్ దారులకు ఎక్కువ వడ్డీ రేట్లు ఇస్తున్నారని నిర్ధారించుకుని ఈ బ్యాంకు పై ఆర్ధిక జరిమానాను విధించడమైనది. ఈ చర్య భారతీయ రిజర్వు బ్యాంకు నియంత్రణ అనుపాలనల లోపాలపై ఆధారపడి తీసుకున్నదే తప్ప, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా అన్వయించుకోరాదు. మరియు, ఈ ఆర్ధిక జరిమానా విధించడం వలన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు పై భారతీయ రిజర్వు బ్యాంకు తీసుకునే ఏ ఇతర చర్య పై ప్రతికూల ప్రభావం చూపదు. (పునీత్ పంచోళీ ) పత్రికా ప్రకటన : 2024-2025/688 |