<font face="mangal" size="3">రాయగఢ్ సహకారీ బ్యాంక్ లిమిటెడ్, ముంబై పై భాĸ - ఆర్‌బిఐ - Reserve Bank of India
రాయగఢ్ సహకారీ బ్యాంక్ లిమిటెడ్, ముంబై పై భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా ద్రవ్య జరిమానా విధింపు
తేది: 20/03/2023 రాయగఢ్ సహకారీ బ్యాంక్ లిమిటెడ్, ముంబై పై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) మార్చ్ 16, 2023 నాటి ఆదేశం ద్వారా, రాయగఢ్ సహకార బ్యాంక్ లిమిటెడ్, ముంబై (బ్యాంకు)పై సూపర్‌వైజరీ యాక్షన్ ఫ్రేమ్‌వర్క్ (SAF) క్రింద జారీ చేయబడిన కార్యాచరణ సూచనల ఉల్లంఘనకు ₹1.00 లక్ష (రూ. ఒక లక్ష మాత్రమే) జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని ఈ జరిమానా విధించబడింది. ఈ చర్య నియంత్రణ అనుపాలనల లోపాలపై ఆధారపడి తీసుకున్నదే తప్ప, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా ఉద్దేశించబడలేదు. నేపధ్యము మార్చి 31, 2021 నాటి బ్యాంక్ ఆర్థిక స్థితికి సంబంధించి ఆర్‌బిఐ నిర్వహించిన చట్టబద్ధమైన తనిఖీ, మిగతా వాటితో సహా, రిస్క్ అసెస్‌మెంట్ రిపోర్ట్ మరియు దానికి సంబంధించిన అన్ని సంబంధిత ఉత్తర ప్రత్యుత్తరాల పరిశీలనలో, సూపర్‌వైజరీ యాక్షన్ ఫ్రేమ్‌వర్క్ (SAF) క్రింద జారీ చేయబడిన కార్యాచరణ సూచనలకు విరుద్దంగా బ్యాంక్ తాజాగా రుణగ్రహీతలకు బంగారంపై రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడైంది. దీని ఆధారంగా, సూపర్‌వైజరీ యాక్షన్ ఫ్రేమ్‌వర్క్ (ఎస్‌ఎఎఫ్) క్రింద ఆర్‌బిఐ జారీ చేసిన కార్యాచరణ సూచనలను ఉల్లంఘించినందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంకుకు నోటీసు జారీ చేయబడింది. జారీ చేసిన నోటీసుకు బ్యాంకు సమర్పించిన ప్రత్యుత్తరం లోని అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత, ఈ విషయంలో ఆర్‌బిఐ జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో ఉల్లంఘన వాస్తవమని మరియు జరిమానా విధించదగినదిగా, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాల్) పత్రికా ప్రకటన: 2022-2023/1892 |