<font face="mangal" size="3">రెయిన్‌బో ఫైనాన్స్ ఇండియా లిమిటెడ్, చెన్నై, Ķ - ఆర్బిఐ - Reserve Bank of India
రెయిన్బో ఫైనాన్స్ ఇండియా లిమిటెడ్, చెన్నై, తమిళనాడుపై భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య జరిమానా విధింపు
మే 22, 2023 రెయిన్బో ఫైనాన్స్ ఇండియా లిమిటెడ్, చెన్నై, తమిళనాడుపై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) మే 19, 2023 నాటి తమ ఉత్తర్వు ద్వారా “స్టాండర్డ్ అసెట్ ప్రొవిజనింగ్ మరియు పరపతి నిష్పత్తికి సంబంధించి సెప్టెంబర్ 01, 2016 తేదీ నాటి “మాస్టర్ డైరెక్షన్ - నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ - నాన్-సిస్టమికల్లి ఇంపార్టెంట్ నాన్-డిపాజిట్ టేకింగ్ కంపెనీ (రిజర్వ్ బ్యాంక్) ఆదేశాలు, 2016” విషయంపై ఆర్బిఐ (RBI) జారీ చేసిన ఆదేశాలను పాటించనందులకు, రెయిన్బో ఫైనాన్స్ ఇండియా లిమిటెడ్, చెన్నై, తమిళనాడు (కంపెనీ) పై ₹4.00 లక్షల (నాలుగు లక్షల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 58Bలోని సబ్-సెక్షన్ (5), క్లాజ్ (aa)తో కలిపి సెక్షన్ 58G, సబ్-సెక్షన్ (1), క్లాజ్ (b) కింద అందించబడిన అధికారాలను వినియోగించుకొని ఆర్బిఐ జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో కంపెనీ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఆర్బిఐ ద్వారా ఈ జరిమానా విధించబడింది. ఈ చర్య నియంత్రణ అనుపాలన లోని లోపాలపై ఆధారపడి తీసుకున్నదే గాని, కంపెనీ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే వొక అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు. నేపథ్యo కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్సైట్ లోని కంపెనీ ప్రొఫైల్ను, ఆర్బిఐ కు NBS రిటర్న్స్ లను మరియు స్టాట్యూటరీ ఆడిటర్ సర్టిఫికేట్ లను పరిశీలించడం వల్ల, మిగతా వాటితోపాటు, కంపెనీ ప్రామాణిక ఆస్తులకు సరిపడునట్లు కాంటింజెంట్ కేటాయింపులు చేయలేదని మరియు అధిక పరపతి నిష్పత్తిని కలిగి ఉందని వెల్లడయ్యింది. పైన పేర్కొన్న వాటి ఆధారంగా, పై ఆదేశాలను పాటించనందుకు దానిపై జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ కంపెనీకి వొక షోకాజ్ నోటీసు జారీ చేయబడింది. నోటీసుకు కంపెనీ ఇచ్చిన ప్రత్యుత్తరమును మరియు వ్యక్తిగత విచారణ లోని మౌఖికఅంశాలను పరిగణనలోకి తీసుకున్న తదుపరి, ఆర్బిఐ(RBI) ఆదేశాల అమలు జరుగలేదని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు వొక నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2023-2024/265 |