తమిళనాడు రాష్ట్రo లోని చెన్నై నగరానికి చెందిన "ఆర్.ఎ.ఆర్. ఫైనాన్స్ లిమిటెడ్“ పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంకు. - ఆర్బిఐ - Reserve Bank of India
తమిళనాడు రాష్ట్రo లోని చెన్నై నగరానికి చెందిన "ఆర్.ఎ.ఆర్. ఫైనాన్స్ లిమిటెడ్“ పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంకు.
“ఉన్నతస్థాయి నిర్దేశకాలు- బ్యాంకేతర ఆర్ధిక సంస్థ – నిర్ణీత పద్ధతికి భిన్నంగా ఇతర ధరావత్తుల సేకరణ - భారతీయ రిజర్వ్ బ్యాంకు నిర్దేశకాలు, 2016 మరియు భారతీయ రిజర్వ్ బ్యాంక ఉన్నతస్థాయి(బ్యాంకేతర ఆర్ధికసంస్థ -స్కేలు ఆధారిత చట్టాలు) నిర్దేశకాలు 2023” కు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణంవల్ల తమిళనాడు రాష్ట్రo లోని చెన్నై నగరానికి చెందిన ఆర్.ఎ.ఆర్. ఫైనాన్స్ లిమిటెడ్ “ మీద భారతీయ రిజర్వ్ బ్యాంకు 28-08-2024 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు .25,000/- ( ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. సెక్షన్ 58 G లోని సబ్ సెక్షన్ (1) కి చెందిన క్లాజు (b) మరియు భారతీయ రిజర్వ్ బ్యాంకు చట్టం 1934 లోని సెక్షన్ 58 B నందలి సబ్ సెక్షన్ (1) లోని క్లాజు(ఎ.ఎ) ద్వారా తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుంటూ భారతీయ రిజర్వ్ బ్యాంకు ఈ అపరాధ రుసుమును విధించింది. డైరెక్టర్లను నియమిస్తూ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలను పరిశీలించిన మీదట ఎన్. బి. ఎఫ్.సి. యొక్క మేనేజిమెంటు మార్పులో భారతీయ రిజర్వ్ బ్యాంకు మార్గనిర్దేశకాలను అతిక్రమించినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంకు గుర్తించింది. భారతీయ రిజర్వ్ బ్యాంకు మార్గనిర్దేశకాలను అతిక్రమించినట్లు పర్యవేక్షక బృందం నిర్ధారించిన పిదప సదరు ఆర్ధిక సంస్థ పై అపరాధ రుసుమును ఎందుకు విధించకూడదో తెలుపవలసినదిగా సదరు బ్యాంకుకు ఒక నోటీసును జారీ చేసింది. ఈ నోటీసుకు సదరు సంస్థ పంపిన ప్రత్యుత్రరము, మౌఖిక సమర్పణల ఆధారంగా స్వతంత్ర డైరెక్టర్లను మినహాయిస్తే మిగిలిన డైరెక్టర్లలో 30 కంటే అధిక శాతం భారతీయ రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండా నియమకాలు జరిగినట్లు నిర్ధారించి సదరు అపరాధరుసుమును విధిoచింది. నియమ నిబంధనలను సరిగా పాటించని కారణంగా ఈ చర్య తీసుకోబడింది. అంతే కానీ బ్యాంకు యొక్క ఖాతాదారులు జరుపుతున్న లావాదేవీలు, ఒప్పందాలపై ఈ చర్య ఎటువంటి ప్రభావము చూపదు. అపరాధ రుసుము విధించినప్పటికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ సదరు బ్యాంక్ పైన మరేదైనా చర్య తీసుకొనే అధికారం కలిగి వుంటుంది (పునీత్ పాoచోలి) పత్రికా విడుదల: 2024-2025/1024 |