RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

115426129

మహారాష్ట్ర లోని సోలాపుర్ నగరానికి చెందిన "సమర్థ్ సహకారి బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్.

"పట్టణ సహకార బ్యాంకుల నియమ నిభంధనలను బహిరంగ పరచుట" మరియు “ ప్రాధమిక(పట్టణ)సహకార బ్యాంకుల పర్యవేక్షణ చర్యాచటం”కు సంబధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల మహారాష్ట్ర లోని సోలాపుర్ నగరానికి చెందిన "సమర్థ్ సహకారి బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంకు 12-04-2024 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 4,50,000 (నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 లోని 47A (i)(C), 46(4)(i) మరియు 56 విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

ఈ బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిగతులపై 31-03-2023 తేదీన భారతీయ రిజర్వ్ బ్యాంకు చట్టబద్ధమైన విచారణ జరిపింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన మార్గ నిర్దేశకాలను సదరు బ్యాంక్ పరిమితికి మించి భద్రత లేని బయనాలను మంజూరు చేసినట్లు గుర్తించి సదరు బ్యాంక్ మీద ఎందుకు చర్య తీసుకొనకూడదో వివరించాలంటూ ఒక నోటిసు ను జారీ చేసింది.

సదరు బ్యాంకు (i) చివరిగా మదింపు చేసిన సి.ఆర్‌.ఎ.ఆర్‌.9 శాతం కంటె తక్కువగా ఉన్నప్పటికీ వాటా పెట్టుబడులను తను సభ్యులకు వాపసు చేయడానికి అంగీకరించడం. (ii) నామమాత్ర సభ్యులకు తమ నియంత్రణ పరిధికి మించి అధిక మొత్తంలో అప్పులను మంజూరు చేయడం. (iii) పట్టణ సహకార బ్యాంకుల పర్యవేక్షణ  జారీ చేసిన కార్యాచరణ సూచనలను అతిక్రమిస్తూ ధరావత్తుల మీద భారతీయ స్టేట్ బ్యాంకు యొక్క వడ్డీ రేట్ల కంటే వడ్డీ అధికంగా చెల్లించడం.

ఈ నోటీసుకు బ్యాంకు వారు పంపిన ప్రత్యుత్తరము, దాఖలు పరచిన అదనపు సమాచారము మరియు మౌఖిక సమర్పణల ఆధారంగా సదరు బ్యాంక్ పై అపరాధ రుసుమును విధించింది.

నియమ నిబంధనలను సరిగా పాటించని కారణంగా ఈ చర్య తీసుకోబడింది. అంతే కానీ బ్యాంకు యొక్క ఖాతాదారులు జరుపుతున్న లావాదేవీలు, ఒప్పందాలపై ఈ చర్య ఎటువంటి ప్రభావము చూపదు. అపరాధ రుసుము విధించినప్పటికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ సదరు బ్యాంక్ పైన మరేదైనా చర్య తీసుకొనే అధికారం కలిగి వుంటుంది.

(పునీత్ పాoచోలి)     
ముఖ్య నిర్వహణ అధికారి

పత్రికా విడుదల: 2024-2025/1069

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?