మహారాష్ట్రలోని ముంబైలో గల సాంగ్లి సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై రిజర్వు బ్యాంకు ద్రవ్య జరిమానా విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
మహారాష్ట్రలోని ముంబైలో గల సాంగ్లి సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై రిజర్వు బ్యాంకు ద్రవ్య జరిమానా విధింపు
మహారాష్ట్రలోని ముంబైలో గల సాంగ్లి సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 సెప్టెంబర్ 15 నాడు జారీచేసిన ఉత్తర్వు ద్వారా రూ.2.00 లక్షల ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘డైరెక్టర్ల బోర్డు – యూసీబీల’ విషయంలో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి లేకపోవడంతో ఈ నగదు జరిమానా వేసింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది. ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు. నేపథ్యం: 2022 మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఆర్ బి ఐ చట్టబద్ధమైన తనిఖీలు నిర్వహించింది. తనిఖీ నివేదిక, ప్రమాద అంచనా నివేదిక, ఇతర సంబంధిత నివేదికల పరిశీలనల్లో బ్యాంకు డైరెక్టర్లలో ఒకరి బంధువుకు ఇచ్చిన రుణాన్ని పునరుద్ధరించినట్లు వెల్లడైంది. దీంతో, తమ మార్గదర్శకాలను పాటించనందుకు ఎందుకు జరిమానా విధించకూడదో తెలుపాలంటూ.. సాంగ్లి సహకారి బ్యాంకు లిమిటెడ్‌కు ఆర్ బి ఐ షోకాజు నోటీసు జారీ చేసింది. నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ సందర్భంగా ఇవ్వబడిన మౌఖిక సమర్పణలు పరిగణనలోకి తీసుకున్న తదుపరి, బ్యాంక్ ద్వారా ఆర్బీఐ ఆదేశాల ఉల్లంఘన జరిగిందని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.
(యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2023-2024/1321 |