కోల్‌కతాలోని సాపర్స్ ఫైనాన్స్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌పై రిజర్వు బ్యాంకు ద్రవ్య జరిమానా విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
కోల్‌కతాలోని సాపర్స్ ఫైనాన్స్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌పై రిజర్వు బ్యాంకు ద్రవ్య జరిమానా విధింపు
కోల్‌కతాలోని సాపర్స్ ఫైనాన్స్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 నవంబర్ 2 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.1.50 లక్షల ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. (i) బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీ(NBFCs)లకు చెందిన నియంత్రణ కొనుగోలు/బదిలీ కేసులలో ఆర్ బి ఐ నుంచి ముందస్తుగా తీసుకోవాల్సిన అనుమతి (ii) ‘బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీ రిటర్న్స్(రిజర్వు బ్యాంకు) మార్గదర్శకాలు, 2016‘లో చెప్పబడిన నిబంధనలలో ఎన్‌బీఎఫ్‌సీలు సమర్పించే ‘చట్టబద్ధమైన ఆడిటర్ల సర్టిఫికేట్(SAC)’ ఫార్మాట్ విషయంలో నిబంధనలకు కట్టుబడి లేకపోవడంతో సాపర్స్ ఫైనాన్స్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌పై ద్రవ్య జరిమానా వేసింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చట్టం, 1934లో సెక్షన్ 58(B)(5)(aa) మరియు సెక్షన్ 58(G)(1)(b)ల కింద ఆర్ బి ఐకి కల్పించిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా విధించింది. ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, కంపెనీ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు. నేపథ్యం: ఆర్ బి ఐ వద్దకు వచ్చిన సూచన మేరకు నిర్వహించిన పరిశీలనలో ఈ విషయం వెల్లడైంది. (i) యాజమాన్యం మార్పు విషయంలో ముందస్తుగా ఆర్ బి ఐ నుంచి అనుమతి తీసుకోవడంలో విఫలం కావడం (ii) వర్తించే రిటర్నులు, చట్టబద్ధమైన ఆడిటర్ల సర్టిఫికేట్ను ఆర్ బి ఐకి సమర్పించలేదని వెల్లడైంది. దీంతో తమ మార్గదర్శకాలను పాటించనందుకు ఎందుకు జరిమానా విధించకూడదో తెలుపాలంటూ షోకాజు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు కంపెనీ ఇచ్చిన సమాధానం, వ్యక్తిగత విచారణ సమయంలో కంపెనీ ఇచ్చిన మౌఖిక స్పందనను పరిగణనలోకి తీసుకున్న ఆర్ బి ఐ.. తాము జారీ చేసిన మార్గదర్శకాలను పాటించడంలో కంపెనీ విఫలమైనట్లు నిర్ధారణకు వచ్చింది. దీంతో, కంపెనీపై ద్రవ్య జరిమానా విధించాలని రిజర్వు బ్యాంకు నిర్ణయించింది.
(యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2023-2024/1322 |