RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

103377600

సర్దార్‌గంజ్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, జిల్లా ఆనంద్ (గుజరాత్)పై భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా ద్రవ్య జరిమానా విధింపు

తేది: 19/12/2022

సర్దార్‌గంజ్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, జిల్లా ఆనంద్ (గుజరాత్)పై
భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా ద్రవ్య జరిమానా విధింపు

సర్దార్‌గంజ్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, జిల్లా ఆనంద్ (గుజరాత్), ‘చట్టబద్ధమైన నిల్వల నిర్వహణ - నగదు నిల్వల నిష్పత్తి (CRR) మరియు చట్టబద్ధమైన ద్రవ్య నిష్పత్తి (SLR)’ నిబంధనలపై ప్రాథమిక (అర్బన్) సహకార బ్యాంకులకు భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు మరియు జనవరి 01, 2022 నాటి ఆదేశాలు క్రింద జారీ చేయబడిన సూపర్‌వైజరీ యాక్షన్ ఫ్రేమ్‌వర్క్ (SAF) నిర్దిష్ట ఆదేశాలను పాటించనందుకు, RBI తన డిసెంబర్ 15, 2022 నాటి ఉత్తర్వు ద్వారా బ్యాంకుపై రూ.3.00 లక్షలు (రూ. మూడు లక్షల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. RBI జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని, ఈ జరిమానా విధించబడింది.

ఈ చర్య నియంత్రణ అనుపాలనల లోపాలపై ఆధారపడి తీసుకున్నదే తప్ప, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా భావించరాదు.

నేపధ్యము

బ్యాంక్ యొక్క మార్చి 31, 2018 మరియు మార్చి 31, 2019 నాటి ఆర్థిక స్థితి ఆధారంగా చేపట్టిన తనిఖీ నివేదికలు మిగతావాటితో కలిపి, సూపర్‌వైజరీ యాక్షన్ ఫ్రేమ్‌వర్క్ (SAF) క్రింద జారీ చేయబడిన నిర్దిష్ట ఆదేశాలు మరియు కనీస నగదు నిల్వల నిష్పత్తి (CRR)ని RBI జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలకు అనుగుణంగా బ్యాంక్ నిర్వహించలేదని వెల్లడించాయి. దీని ఆధారంగా, RBI జారీ చేసిన ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంకుకు నోటీసు జారీ చేయబడింది.

బ్యాంక్ యొక్క ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత, ఈ విషయంలో బ్యాంకు ద్వారా RBI ఆదేశాల ఉల్లంఘన వాస్తవమని మరియు జరిమానా విధించదగినదిగా, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.

(యోగేష్ దయాల్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2022-2023/1404

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?