<font face="mangal" size="3px">శరద్ సహకరి బ్యాంక్ లిమిటెడ్‌, పూణె పై భారతీయ &# - ఆర్బిఐ - Reserve Bank of India
శరద్ సహకరి బ్యాంక్ లిమిటెడ్, పూణె పై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ద్రవ్య జరిమానా విధింపు
జనవరి 02, 2023 శరద్ సహకరి బ్యాంక్ లిమిటెడ్, పూణె పై భారతీయ రిజర్వు భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) డిసెంబర్ 28, 2022 నాటి తమ ఉత్తర్వు ద్వారా “మీ వినియోగదారులను తెలుసుకోండి” మరియు 'డిపాజిట్లపై వడ్డీ రేటు' విషయాలపై RBI జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించినందులకు, శరద్ సహకరి బ్యాంక్ లిమిటెడ్, పూణె (‘బ్యాంక్’) పై ₹6.00 లక్షల (ఆరు లక్షల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (బి.ఆర్. చట్టం) లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని ఈ జరిమానా విధించబడింది. ఈ చర్య నియంత్రణ అనుపాలన లోని లోపాలపై ఆధారపడి తీసుకున్నదే గాని, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే వొక అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు. నేపథ్యo మార్చి 31, 2021 తేదీనాటి బ్యాంక్ ఆర్థిక స్థితికి సంబంధించి RBI నిర్వహించిన చట్టబద్ధమైన తనిఖీ మరియు రిస్క్ అసెస్మెంట్ రిపోర్ట్ మరియు దానికి సంబంధించిన అన్ని సంబంధిత ఉత్తరప్రత్యుత్తరాల పరిశీలనలో, మిగతా వాటితోపాటు, బ్యాంక్ (i) KYC యొక్క కాలానుగుణ నవీకరణ కోసం వ్యవస్థను ఏర్పాటు చేయడంలోను మరియు (ii) క్లెయిమ్దారులకు చెల్లింపులు చేస్తున్నప్పుడు, మరణించిన వ్యక్తిగత డిపాజిటర్లు/ఏకైక యాజమాన్య సంస్థల కరెంట్ ఖాతాలలోని మిగిలిన నిల్వలపై, వర్తించే వడ్డీని చెల్లించడంలోను విఫలమైందని వెల్లడి చేయబడింది. దీనికి అనుగుణంగా, RBI జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను ఉల్లంఘించినందులకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంక్ కు వొక నోటీసు జారీ చేయబడింది. బ్యాంక్ యొక్క ప్రత్యుత్తరం, మరియు వ్యక్తిగత విచారణ లోని మౌఖికఅంశాలను పరిగణనలోకి తీసుకున్న తదుపరి, RBI ఆదేశాల ఉల్లంఘన జరిగిందని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు అనుపాలన విఫలత జరిగిన మేర ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2022-2023/1484 |