RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Press Releases Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

129699871

శ్రీ భారత్ సహకార బ్యాంకు లిమిటెడ్ లిమిటెడ్, వడోదర, గుజరాత్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు

పట్టణ సహకార బ్యాంకులు, తమ డిపాజిట్లను ఇతర బ్యాంకులలో పెట్టేటప్పుడు, భారతీయ రిజర్వు బ్యాంకు, ఇచ్చిన నిబంధనలను(సహకార బ్యాంకులు –డిపాజిట్లపై వడ్డీ రెట్లు) ఆదేశాలు -2016 లను ఉల్లంఘించి నందులకు గాను, శ్రీ భారత్ సహకార బ్యాంకు లిమిటెడ్ లిమిటెడ్, వడోదర, గుజరాత్  పై భారతీయ రిజర్వు బ్యాంకు, తమ ఉత్తర్వు తేది 13/12/2023 ద్వారా రు.5.00 లక్షల (అక్షరాల అయిదు లక్షల రూపాయలు మాత్రమె)జరిమానా విధించినది. బ్యాంకింగ్   రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)(  ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి  రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది.

చట్టబద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరుబ్యాంకు తమఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదేవీ ల ప్రామాణికతలకు సంబంధించినది కాదు . 

నేపధ్యము

ఈ బ్యాంకు యొక్క 31-03-2022 తేది నాటి ఆర్ధిక పరిస్థితి ప్రామాణికముగా రిజర్వు బ్యాంకు వారు చట్ట బద్ధ తనిఖీ నిర్వహించారు.ఆ తనిఖీ నివేదికను,ముప్పు(రిస్క్) అంచనాల నివేదిక మరియు తత్సంబంధిత పత్రములను పరిశీలించిన మీదట బహిర్గతమైన అంశాలు (i)వివేచనతో నిర్ణయింపబడిన అంతర బ్యాంకుల స్థూల బహిర్గత పరిమితి ని ఉల్లంఘించింది మరియు  విజ్ఞతతో నిర్ణయించ బడిన బ్యాంకుల  మధ్య ఉండాల్సిన కౌంటర్ పార్టీ అత్యధిక పరిమితులను ఉల్లంఘించినది,(ii) కాల పరిమితి ముగిసిన ఫిక్సెడ్ డిపాజిట్లపై కాల పరిమితి ముగిసిన నాటి నుండి డిపాజిట్ చెల్లింపబడే తేది వరకు అనుమతించ బడే వడ్డీ రేటు ప్రకారము వడ్డీ చెల్లించక పోవుట. తదనుగుణంగా,పైన పొందుపరచిన అవకతవకలు జరిగినందులకు గాను, భారతీయ రిజర్వు బ్యాంకు  ఆదేశాలు పాటించనందులకుగాను ఈ బ్యాంకుపై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వ వలసినదిగా బ్యాంకు కు నోటీసు ఇవ్వడమైనది. ఈ బ్యాంకు సమర్పించిన వివరణ పరిశీలించిన మీదట, వ్యక్తిగత మౌఖిక విచారణ లో వాదన విన్నమీదట,రిజర్వు బ్యాంకు వారు సూచించిన చట్టబధ్దమైన ఆదేశాల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించుకుని ఈ బ్యాంకు పై ఆర్ధిక పరమైన జరిమానాను విధించడమైనది.

యోగేష్ దయాళ్

చీఫ్ జనరల్ మేనేజర్

 పత్రికా  ప్రకటన 2023-2024/1615

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?