RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

109264437

గుజరాత్, గాంధీనగర్ జిల్లా లోద్రాలో గల శ్రీలోద్ర నాగరిక్ సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై ఆర్‌‌ బి ఐ నగదు జరిమానా విధింపు

గుజరాత్, గాంధీనగర్ జిల్లా లోద్రాలో గల శ్రీలోద్ర నాగరిక్ సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 అక్టోబర్ 6న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.4 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘‘డైరెక్టర్లకు, బంధువులకు, వారు ఆసక్తి ఉన్న సంస్థలకు/అన్యసంస్థలకు రుణాలు, అడ్వాన్సులు’’, “ప్రాథమిక(పట్టణ) సహకార బ్యాంకులు(యు సి బిల) ఇతర బ్యాంకులలో ఉంచే డిపాజిట్ల” విషయంలో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో శ్రీలోద్ర నాగరిక్ సహకారి బ్యాంకు విఫలం కావడంతో ఈ జరిమానా వేసింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది.

ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు.

నేపథ్యం:

2022 మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఆర్ బి ఐ చట్టబద్ధమైన తనిఖీ నిర్వహించింది. తనిఖీ నివేదిక, ప్రమాద అంచనా నివేదిక, ఇతర సంబంధిత నివేదికల పరిశీలనల్లో (i) డైరెక్టర్లలో ఒకరి బంధువుకు రుణాలు జారీ చేసిందని (ii) బ్యాంకులో హామీదారులుగా ఉన్న డైరెక్టర్ల బంధువులకు రుణాలను ఇచ్చిందని (iii) ప్రుడెన్షియల్ ఇంటర్–బ్యాంక్ గ్రాస్ ఎక్స్‌పోజర్ పరిమితిని (iv) ప్రుడెన్షియల్ ఇంటర్–బ్యాంకు కౌంటర్ పార్టీ ఎక్స్‌పోజర్ పరిమితిని బ్యాంకు ఉల్లంఘించిందని వెల్లడైంది. దీంతో, ఆర్‌‌ బి ఐ మార్గదర్శకాలను పాటించనందుకు బ్యాంకుపై ఎందుకు జరిమానా విధించకూడదో తెలుపాలంటూ రిజర్వు బ్యాంకు షోకాజు నోటీసులు జారీ చేసింది.

నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ సందర్భంగా ఇవ్వబడిన మౌఖిక సమర్పణలు పరిగణనలోకి తీసుకున్న తదుపరి, బ్యాంక్ ద్వారా ఆర్ బి ఐ ఆదేశాల ఉల్లంఘన జరిగిందని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.

 

(యోగేష్ దయాళ్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2023‌‌-2024/1247

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?