RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78529042

శ్రీ సమర్థ్ సహకరి బ్యాంక్ లిమిటెడ్, నాసిక్ (మహారాష్ట్ర) పై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ద్రవ్య జరిమానా విధింపు

ఫిబ్రవరి 20, 2023

శ్రీ సమర్థ్ సహకరి బ్యాంక్ లిమిటెడ్, నాసిక్ (మహారాష్ట్ర) పై
భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ద్రవ్య జరిమానా విధింపు

భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ఫిబ్రవరి 14, 2023 నాటి తమ ఉత్తర్వు ద్వారా, పట్టణ సహకార బ్యాంకులకు “ఎక్స్పోజర్ నిబంధనలు & చట్టబద్ధమైన/ ఇతర పరిమితులు-UCBలు మరియు డైరెక్టర్ల బోర్డు-UCBలు” అనే విషయాలపై RBI జారీ చేసిన ఆదేశాలను పాటించనందులకు/ఉల్లంఘించినందులకు శ్రీ సమర్థ్ సహకరి బ్యాంక్ లిమిటెడ్, నాసిక్ (మహారాష్ట్ర) (‘బ్యాంక్’) పై 50,000 (యాభై వేల రూపాయలు మాత్రమే) ద్రవ్య జరిమానా విధించింది. RBI జారీ చేసిన పై ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని RBI ద్వారా ఈ జరిమానా విధింపబడింది.

ఈ చర్య నియంత్రణ అనుపాలన లోని లోపాలపై ఆధారపడి తీసుకున్నదే గాని, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే వొక అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు.

నేపథ్యo

మార్చి 31, 2022 నాటి బ్యాంక్ ఆర్థిక స్థితి ఆధారంగా రిస్క్ అసెస్‌మెంట్ రిపోర్ట్ ద్వారా, RBI జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలకు విరుద్ధంగా/ఉల్లంఘించి డైరెక్టర్ యొక్క బంధువుకు మంజూరు చేసిన రుణాన్ని బ్యాంక్ పునరుద్ధరించిందని వెల్లడి చేయబడింది. దీని ఆధారంగా, పైన ఉటంకించిన ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంక్ కు వొక నోటీసు జారీ చేయబడింది.

బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరములు, మరియు వ్యక్తిగత విచారణ లోని మౌఖికఅంశాలను పరిగణనలోకి తీసుకున్న తదుపరి, బ్యాంక్ ద్వారా RBI ఆదేశాల ఉల్లంఘన జరిగిందని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.

(యోగేష్ దయాళ్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2022-2023/1754

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?