<font face="mangal" size="3">శ్రీ కన్యకా నగరి సహకారీ బ్యాంక్ లిమిటెడ్, చం - ఆర్బిఐ - Reserve Bank of India
శ్రీ కన్యకా నగరి సహకారీ బ్యాంక్ లిమిటెడ్, చంద్రపూర్, మహారాష్ట్రపై భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా ద్రవ్య జరిమానా విధింపు
తేది: 12/12/2022 శ్రీ కన్యకా నగరి సహకారీ బ్యాంక్ లిమిటెడ్, చంద్రపూర్, మహారాష్ట్రపై భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా ద్రవ్య జరిమానా విధింపు శ్రీ కన్యకా నగరి సహకారీ బ్యాంక్ లిమిటెడ్, చంద్రపూర్, మహారాష్ట్ర, “మీ వినియోగదారుని తెలుసుకోండి (KYC)” నిబంధనలపై UCBలకు భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) జారీ చేసిన ఆదేశాలను పాటించనందుకు/ఉల్లంఘించినందుకు, RBI తన డిసెంబర్ 05, 2022 నాటి ఉత్తర్వు ద్వారా బ్యాంకుపై రూ.4.00 లక్షలు (రూ. నాలుగు లక్షల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. RBI జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే విధంగా) లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని, ఈ జరిమానా విధించబడింది. ఈ చర్య నియంత్రణ అనుపాలనల లోపాలపై ఆధారపడి తీసుకున్నదే తప్ప, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా భావించరాదు. నేపధ్యము బ్యాంక్ యొక్క మార్చి 31, 2021 నాటి ఆర్థిక స్థితి ఆధారంగా చేపట్టిన తనిఖీ నివేదిక మిగతావాటితో కలిపి, బ్యాంక్ లో (i) ఖాతాల నష్ట భయ వర్గీకరణ యొక్క కాలానుగుణ సమీక్ష వ్యవస్థ, (ii) కస్టమర్ల KYC యొక్క కాలానుగుణ నవీకరణ వ్యవస్థ, మరియు (iii) అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడానికి మరియు పర్యవేక్షించడానికి బలమైన సాంకేతిక పరిజ్ఞానం (సాఫ్ట్వేర్) లేవని వెల్లడించింది. దీని ఆధారంగా, ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంకుకు నోటీసు జారీ చేయబడింది. బ్యాంక్ యొక్క ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత, ఈ విషయంలో బ్యాంకు ద్వారా RBI ఆదేశాల ఉల్లంఘన వాస్తవమని మరియు జరిమానా విధించదగినదిగా, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాల్) పత్రికా ప్రకటన: 2022-2023/1353 |