శివగంగై జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, శివగంగై, తమిళనాడు పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
శివగంగై జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, శివగంగై, తమిళనాడు పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు
జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు సంబంధించి, “ ఫ్రాడ్స్ –వర్గీకరణ, నివేదికల సమర్పణ మరియు పర్యవేక్షణ” ల పై జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) ఇచ్చిన నిర్దేశిత ఆదేశాలను ఉల్లంఘించినందులకుగాను శివగంగై జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, శివగంగై, తమిళనాడు పై భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేదీ 3 జులై 2024 ద్వారా రు.25,000 (అక్షరాల ఇరవై అయిదు వేల రూపాయలు మాత్రమే) ఆర్ధిక జరిమానా విధించడమైనది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)( ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది. ఈ బ్యాంకులో 31 మార్చ్ 2023 ఆర్ధిక స్థితి ఆధారంగా నాబార్డ్ చట్టబద్ధ తనిఖీ నిర్వహించారు. ఆ తనిఖీ లో ఈ బ్యాంకు, నాబార్డ్ వారు ఇచ్చిన విధి విధానాలను/ఆదేశాలను ఉల్లంఘించారని గమనించి, తత్సబంధిత పత్రములను పరిశీలించి, నాబార్డ్ ఆదేశాలను పాటించనందులకు గాను ఈ బ్యాంకుపై జరిమానా ఎందుకు విధించకూడదో వివరణ ఇవ్వవలసినదిగా నోటీసు ఇవ్వడమైనది. ఈ బ్యాంకు సమర్పించిన వివరణ పరిశీలించిన మీదట, వ్యక్తిగత మౌఖిక విచారణ లో వాదన విన్నమీదట సదరు బ్యాంకు,ఫ్రాడ్స్ వివరములను నాబార్డ్ కి తెలియపరచుటలో ఆలస్యము జరిగినదని ధృవీకరించుకుని, భారతీయ రిజర్వు బ్యాంకు ఈ ఆర్ధిక జరిమానా విధించడమైనది. ఈ చర్య భారతీయ రిజర్వు బ్యాంకు నియంత్రణ అనుపాలనల లోపాలపై ఆధారపడి తీసుకున్నదే తప్ప, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా అన్వయించుకోరాదు. మరియు, ఈ ఆర్ధిక జరిమానా విధించడం వలన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు పై భారతీయ రిజర్వు బ్యాంకు తీసుకునే ఏ ఇతర చర్య పై ప్రతికూల ప్రభావం చూపదు.
(పునీత్ పంచోళీ ) చీఫ్ జనరల్ మేనేజర్ పత్రికా ప్రకటన : 2024-2025/703 |