RBI imposes monetary penalty on Solapur District Central Co-operative Bank Limited, Solapur, Maharashtra
మహారాష్ట్రలోని సోలాపూర్‌లో గల సోలాపూర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్‌పై 2024 ఫిబ్రవరి 22 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.5 లక్షల (ఐదు లక్షల రూపాయల మాత్రమే) జరిమానా విధిస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) ప్రకటించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949(బీఆర్ చట్టం) చెందిన సెక్షన్ 56 కలుపుకుని సెక్షన్ 26ఏ యొక్క నిబంధనలను మరియు డిపాజిటరు విద్య మరియు అవగాహన నిధి విషయంలో ఆర్.బి.ఐ జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘించడంతో ఈ జరిమానా విధిస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొంది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్ 47A(1)(c) కింద ఆర్.బి.ఐకి కల్పించబడిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా విధింపబడింది. ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు. నేపథ్యం 2023 మార్చి 31 నాటికి ఉన్న బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న నేషనల్ బ్యాంకు ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డ్) చట్టబద్ధమైన తనిఖీ నిర్వహించింది. తనిఖీ నివేదిక మరియు ఇతర సంబంధిత నివేదికల పరిశీలనలో బ్యాంకు అర్హత కలిగిన మొత్తాన్ని డిపాజిటరు విద్య మరియు అవగాహన నిధికి(డీఈఏ ఫండ్‌కు) బదిలీ చేయలేదని వెల్లడైంది. దీంతో, తాము జారీ చేసిన చట్టబద్ధమైన మార్గదర్శకాలను పాటించనందుకు బ్యాంకుపై ఎందుకు ద్రవ్య జరిమానా విధించకూడదో తెలుపాలంటూ సోలాపూర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు ఆర్.బి.ఐ షోకాజు నోటీసు జారీ చేసింది. నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరంలోని సమాధానాన్ని పరిగణనలోకి తీసుకున్న తదుపరి, చట్టబద్ధమైన ప్రొవిజన్లను పాటించడంలో బ్యాంకు ఉల్లంఘించిందని, ఆర్.బి.ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి లేదని భారతీయ రిజర్వు బ్యాంకు గుర్తించింది. దీంతో, పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.
(యోగేష్దయాళ్ చీఫ్జనరల్మేనేజర్ పత్రికా ప్రకటన: 2023-2024/1976 |