RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

111743961

పత్రికా ప్రకటన శ్రీ కాళహస్తి పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్, ఆంధ్ర ప్రదేశ్ పై భారతీయ రిజర్వు బ్యాంకు వారి ఆర్ధిక జరిమానా విధింపు

బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949, సెక్షన్ 31 లో  పొందుపరచిన అధికరణములను పాటించనందులకుగాను శ్రీ కాళహస్తి పట్టణ సహకార  బ్యాంకు లిమిటెడ్ ఆంధ్ర ప్రదేశ్ పై భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేది అక్టోబర్ 04, 2024 ద్వారా రు.50,000/-(అక్షరాల ఏభై వేల రూపాయలు మాత్రమే) ఆర్ధిక జరిమానా విధించినది. బ్యాంకింగ్  రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి  రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది.

చట్ట బద్ధ ఆదేశాలను పాటించ లేదని తనిఖీ నివేదికలో పొందుపరచిన అంశాలను, తత్సంబంధిత సమాచార పత్రాలను పరిగణన లోకి తీసుకుని, చట్ట బద్ధ ఆదేశాలను పాటించుటలో వైఫల్యము చెందినందులకుగాను  సదరు బ్యాంకుపై ఎందుకు ఆర్ధికజరిమానా విధించరాదో వివరణ కోరుతూ నోటీసు ఇవ్వడమైనది. ఈ బ్యాంకు సమర్పించిన వివరణ పరిశీలించిన మీదట, వ్యక్తిగత మౌఖిక విచారణ లో వాదన విన్నమీదట, రిజర్వు బ్యాంకు వారు సూచించిన చట్టబధ్దమైన ఆదేశాల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించుకుని ఈ బ్యాంకు పై ఆర్ధిక పరమైన జరిమానాను విధించడమైనది.

2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఆడిటర్ నివేదిక తో పాటు బ్యాంకు యొక్క ఖాతాలు మరియు బ్యాలెన్స్ షీట్ లను  నిర్ణీత మూడు నెలల లోపు భారతీయ రిజర్వు బ్యాంకు కి సమర్పించడంలో బ్యాంకు విఫలమైంది.

ఈ చర్య నియంత్రణ అనుపాలనల లోపాలపై ఆధారపడి తీసుకున్నదే తప్ప, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా అన్వయించుకోరాదు. మరియు, ఈ ద్రవ్య జరిమానా విధించడం వలన బ్యాంకుకు వ్యతిరేకంగా భారతీయ రిజర్వు బ్యాంకు తీసుకునే ఏ ఇతర చర్య ప్రతికూల ప్రభావం చూపదు.

(పునీత్ పంచోలీ)       
చీఫ్ జనరల్ మేనేజర్     

 

పత్రికా ప్రకటన: 2024-2025/1285

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?