స్టాండర్డ్ పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్, ఔరంగాబాద్(ఎంహెచ్)పై ద్రవ్య జరిమానా విధించిన ఆర్.బి.ఐ - ఆర్బిఐ - Reserve Bank of India
స్టాండర్డ్ పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్, ఔరంగాబాద్(ఎంహెచ్)పై ద్రవ్య జరిమానా విధించిన ఆర్.బి.ఐ
ఔరంగాబాద్ స్టాండర్డ్ పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్‌పై 2024 మార్చి 19 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.50,000(యాభై వేల రూపాయల) జరిమానా విధిస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) ప్రకటించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949(బీఆర్ చట్టం)లోని సెక్షన్ 56తో కలుపుకుని సెక్షన్ 26ఏ కిందనున్న నిబంధనల ఉల్లంఘన జరగడంతో బ్యాంకుపై ఈ జరిమానా విధించింది. బీఆర్ చట్టంలోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్ 47A(1)(c) కింద ఆర్.బి.ఐకి కల్పించబడిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా విధించింది. 2022 మార్చి 31 నాటికి ఉన్న బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఆర్.బి.ఐ ఈ బ్యాంకుపై చట్టబద్ధమైన తనిఖీ నిర్వహించింది. చట్టబద్ధమైన నిబంధనలు/ఆర్.బి.ఐ మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైందని గుర్తించడంతో పాటు, సంబంధిత ఇతర నిర్ధారణల ఆధారంగా బీఆర్ చట్టం కింద పేర్కొనబడిన నిబంధనలు అనుసరించడంలో విఫలమైనందుకు ఎందుకు జరిమానా విధించకూడదో తెలుపాలంటూ ఔరంగాబాద్ స్టాండర్డ్ పట్టణ సహకార బ్యాంకుకు షోకాజు నోటీసు జారీ చేసింది. నోటీసుకు బ్యాంకు ఇచ్చిన ప్రత్యుత్తరాన్ని, వ్యక్తిగత విచారణ సమయంలో బ్యాంకు ఇచ్చిన మౌఖిక సమర్పణలను విన్న తర్వాత, గడువు లోపల అర్హత కలిగిన మొత్తాన్ని డిపాజిటరు విద్య మరియు అవగాహన నిధికి(డీఈఏ ఫండ్‌కు) బదిలీ చేయడంలో విఫలమవుతూ వస్తుందని ఆర్.బి.ఐ గుర్తించింది. దీంతో, ఔరంగాబాద్ స్టాండర్డ్ పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్‌పై ఆర్.బి.ఐ ద్రవ్య జరిమానా విధించింది. ఆర్.బి.ఐ తీసుకున్న ఈ చర్య నియంత్రణా ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు. ఈ ద్రవ్య జరిమానా విధింపు బ్యాంకుపై ఆర్.బి.ఐ తీసుకునే మరే ఇతర చర్యలకు పక్షపాత ధోరణిగా ఉండదు. (యోగేష్ దయాళ్) చీఫ్జనరల్ మేనేజర్ పత్రికా ప్రకటన : 2023 - 2024/2132 |