RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

108876250

సూరత్ జాతీయ సహకార బ్యాంక్ లిమిటెడ్, సూరత్, గుజరాత్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

 ‘సహకార బ్యాంకులు-డిపాజిట్లపై వడ్డీ రేట్ల’కు మరియు ‘అనధికార ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలలో సహకార బ్యాంకుల ఖాతాదారుల బాధ్యతను పరిమితం చేయడం’కు సంబంధించి ఆర్బీఐ రూపొందించిన మార్గనిర్ధేశాలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A (1)(c) తో పాటు 46 (4)(I) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా సెప్టెంబర్ 18, 2023 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా సూరత్ జాతీయ సహకార బ్యాంక్ లిమిటెడ్, సూరత్, గుజరాత్ (బ్యాంక్) వారి పై ₹6 లక్షలు (ఆరు లక్షల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి ఇతర లావాదేవిలతో గానీ, ఒప్పందాల చెల్లుబాటు విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు.

నేపథ్యం:

మార్చి 31, 2022 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి ఆర్బిఐ చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది.  ఈ పరిశీలన భాగంగా తనిఖీ నివేదిక, రిస్క్ అంచనా నివేదిక మరియు దానికి సంబంధించిన అన్ని ప్రత్యుత్తరాల సమగ్ర పరిశీలన ద్వారా వెల్లడైన అంశాలు (i) బ్యాంకు వద్దనుండి కాల పరిమితి దాటిన టర్మ్ డిపాజిట్లపై మెచూరిటీ చెందిన సమయం నుండి తిరిగి చెల్లించే తేదీ వరకు వర్తించే వడ్డీని చెల్లించలేదు. (ii) అనధికార లావాదేవీలను తక్షణమే నివేదించడం కోసం బ్యాంక్ పంపిన ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించిన SMSకి, ఇమెయిల్ హెచ్చరికలకు 'ప్రత్యుత్తరం' (రిప్లయ్) ద్వారా ప్రతిస్పందించే సౌకర్యాన్ని కస్టమర్‌లకు అందించలేదు. కావున ఆర్బిఐ రూపొందించిన విదివిధానాలను అనుసరించుటలో వైఫల్యం కారణంగా బ్యాంకు పై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది.

భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటీసుకు బ్యాంకు వారి వివరణ పరిశీలించిన తరువాత, మరియు బ్యాంకుతో సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ పరిగణించిన పిమ్మట, లోగడ పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలను అనుసరించుటలో లోపాలకు గాను ఆర్బిఐ విధించిన నగదు జరిమానా సరియైనది, సహేతుకమైనదిగా నిర్ధారించడమైనది.

(యోగీష్ దయాళ్)    
ముఖ్య నిర్వహణ అధికారి

పత్రికా విడుదల: 2023-2024/1141

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?