RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

104376639

పూణే లోని సువర్ణయుగ్ సహకరి బ్యాంక్ లిమిటెడ్‌ పై భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య జరిమానా విధింపు

మే 02, 2023

పూణే లోని సువర్ణయుగ్ సహకరి బ్యాంక్ లిమిటెడ్‌ పై భారతీయ రిజర్వు
బ్యాంకు ద్రవ్య జరిమానా విధింపు

భారతీయ రిజర్వు బ్యాంకు, ఏప్రిల్ 27, 2023 నాటి ఆర్డర్ ద్వారా డిపాజిట్ ఖాతాల నిర్వహణకు సంబంధించి ఆర్బిఐ (RBI) జారీ చేసిన ఆదేశాలను పాటించనందులకు సువర్ణయుగ్ సహకరి బ్యాంక్ లిమిటెడ్‌, పూణే (బ్యాంక్) పై 1.00 లక్ష (ఒక లక్ష రూపాయలు మాత్రమే) జరిమానాను విధించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని, ఆర్బిఐ (RBI) చే జారీచేయబడ్డ పై ఉటంకించబడిన ఆదేశాలను బ్యాంక్ పాటించనందులకు, ఆర్బిఐ (RBI) ద్వారా ఈ జరిమానా విధించబడింది.

ఈ చర్య నియంత్రణ అనుపాలన లోని లోపాలపై ఆధారపడి తీసుకున్నదే గాని, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే వొక అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు.

నేపథ్యo

మార్చి 31, 2021 తేదీ నాటిక బ్యాంక్ ఆర్థిక స్థితికి సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు జరిపిన చట్టబద్ధమైన తనిఖీ మరియు రిస్క్ అసెస్‌మెంట్ రిపోర్ట్ మరియు దానికి సంబంధించిన అన్ని ఉత్తర ప్రత్యుత్తరము(కరస్పాండెన్స్‌)ల పరిశీలనలో, మిగతావాటితోపాటు, ఆ బ్యాంక్ పొదుపు ఖాతాలలో కనీస నిల్వ నిర్వహణలో కొరతకు (షార్ట్-ఫాల్) సంబంధించి, చార్జీ ని కొరత బడిన మేరకు దామాషా ప్రకారం కాకుండా; బ్యాంక్, నోటీసు ఇచ్చిన తేదీ నుండి ఒక నెలలోపు ఖాతాలో కనీస నిల్వ పునరుద్ధరించబడనట్లయితే, పొదుపు బ్యాంకు ఖాతాలలో కనీస నిల్వ నిర్వహణలో కొరతకు జరిమానా ఛార్జీలు వర్తిస్తాయి అని నోటిసు ఇవ్వకుండా, నిర్ణీత జరిమానాను వసూలు చేస్తున్నట్లు వెల్లడయ్యింది. పైన పేర్కొన్న వాటి ఆధారంగా, భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన డిపాజిట్ ఖాతాల నిర్వహణపై పేర్కొన్న ఆదేశాలను ఉల్లంఘించినందుకు, దానిపై జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంక్ కు వొక నోటీసు జారీ చేయబడింది.

నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన వ్రాతపూర్వక ప్రత్యుత్తరాన్ని పరిగణనలోకి తీసుకున్న తదుపరి, ఆర్బిఐ (RBI) ఆదేశాల అమలు జరుగలేదని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ఆదేశాల ఉల్లంఘనం జరిగినంత మేరకు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు వొక నిర్ధారణకు వచ్చింది.

(యోగేష్ దయాల్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2023-2024/167

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?