ఏ. పి రాజ రాజేశ్వరి మహిళ పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్, హైదరాబాద్ పై భారతీయ రిజర్వు బ్యాంకు చే ఆర్ధిక జరిమానా విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
ఏ. పి రాజ రాజేశ్వరి మహిళ పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్, హైదరాబాద్ పై భారతీయ రిజర్వు బ్యాంకు చే ఆర్ధిక జరిమానా విధింపు
పట్టణ సహకార బ్యాంకులలో “ఋణ ఖాతాల నిర్వహణ –పట్టణ సహకార బ్యాంకులు” విషయముపై భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన కొన్ని ఆదేశాలను పాటించనందులకు గాను ఏ. పి రాజ రాజేశ్వరి మహిళ పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్ హైదరాబాద్(బ్యాంకు) పై భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేదీ మార్చి3, 2025 ద్వారా రు.50,000/- ల (అక్షరాల యాభై వేల రూపాయలు మాత్రమే) ఆర్ధిక జరిమానా విధించినది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది. ఈ బ్యాంకు యొక్క ఆర్ధిక పరిస్థితి ప్రామాణికముగా 31-03-2023 తేది నాటికి రిజర్వు బ్యాంకు వారు చట్ట బద్ధ తనిఖీ నిర్వహించారు. భారతీయ రిజర్వు బ్యాంకు ఆదేశాలను పాటించ లేదన్న విషయమును, తత్సంబంధిత ఉత్తర ప్రత్యుత్తరాలను ఆ తనిఖీ లో గమనించడము జరిగినది, తదనుగుణంగా, పైన పొందుపరచిన అవకతవకలు జరిగినందులకు గాను, భారతీయ రిజర్వు బ్యాంకు ఆదేశాలు పాటించనందులకుగాను ఈ బ్యాంకుపై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వ వలసినదిగా బ్యాంకు కు నోటీసు ఇవ్వడమైనది. ఈ బ్యాంకు సమర్పించిన వివరణ పరిశీలించిన మీదట, వ్యక్తిగత మౌఖిక విచారణ లో వాదన విన్నమీదట,రిజర్వు బ్యాంకు వారు సూచించిన చట్టబధ్దమైన ఆదేశాల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించుకుని ఈ బ్యాంకు పై ఆర్ధిక పరమైన జరిమానాను విధించడమైనది. బంగారు ఆభరణములపై ఋణముల విషయములో “బుల్లెట్ చెల్లింపు విధానము” కింద, నిర్దేశించబడిన నియంత్రణ పరిమితి కి మించి ఋణములు మంజూరు చేయడము జరిగినది. చట్టబద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరుబ్యాంకు తమఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదే వీల ప్రామాణికతలకు సంబంధించినది కాదు. ముందు ముందు ఈ బ్యాంకు పై, భారతీయ రిజర్వు బ్యాంకు తీసుకోదలచిన చర్యలకు ఈ ఆర్ధిక జరిమానా అడ్డంకి కాబోదు. (పునీత్ పంచోళీ) పత్రిక ప్రకటన: 2024-2025/2317 |