ఆదిలాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్, తెలంగాణ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య జరిమానా విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
ఆదిలాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్, తెలంగాణ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య జరిమానా విధింపు
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 లోని సెక్షన్ 20 తో కలిపి చదువదగిన సెక్షన్ 56లో పొందుపరిచిన నిబంధనలు ఉల్లంఘించబడినందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా జూన్ 04, 2025 తేదీన జారీ చేసిన ఉత్తర్వు ద్వారా ఆదిలాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్, తెలంగాణ (బ్యాంక్) వారి పై రూ.1.00 లక్ష ( లక్ష రూపాయలు మాత్రమే) ద్రవ్య జరిమానా విధించడమైనది. (పునీత్ పంచోళీ) పత్రిక ప్రకటన: 2025-2026/486 |