ఆదినాథ్ సహకార బ్యాంక్ లిమిటెడ్., జిల్లా సూరత్, గుజరాత్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
ఆదినాథ్ సహకార బ్యాంక్ లిమిటెడ్., జిల్లా సూరత్, గుజరాత్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు
‘ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల (UCBs)’ ద్వారా ఇతర బ్యాంకులలో డిపాజిట్ల జమ’ కు సంబంధించి ఆర్బీఐ రూపొందించిన మార్గనిర్ధేశాలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా ఫిబ్రవరి 13, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా ఆదినాథ్ సహకార బ్యాంక్ లిమిటెడ్., జిల్లా సూరత్, గుజరాత్, (బ్యాంక్) వారి పై ₹1.50 లక్షలు (ఒక లక్ష యాబై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది. ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి ఇతర లావాదేవిలతో గానీ, ఒప్పందాల చెల్లుబాటు విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు. నేపథ్యం: మార్చి 31, 2023 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి ఆర్బిఐ చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది. ఈ పరిశీలనలో భాగంగా తనిఖీ నివేదిక, రిస్క్ అంచనా నివేదిక మరియు దానికి సంబంధించిన అన్ని ప్రత్యుత్తరాల సమగ్ర పరిశీలన ద్వారా బ్యాంకు ప్రుడెన్షియల్ ఇంటర్‌బ్యాంక్ స్థూల ఎక్స్పోజర్ పరిమితిని మరియు ప్రుడెన్షియల్ ఇంటర్-బ్యాంక్ కౌంటర్ పార్టీ ఎక్స్పోజర్ పరిమితిని ఉల్లఘించినట్లు వెల్లడైనది. ఈ పరిశీలనల ఆధారంగా, నిర్దేశిత నిబంధనలను అనుసరించుటలో వైఫల్యం కారణంగా బ్యాంకు పై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది. భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటీసుకు బ్యాంకు వారి వివరణ పరిశీలించిన తరువాత, మరియు బ్యాంకుతో ప్రత్యక్ష సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ పరిగణించిన పిమ్మట, పైన పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలను అనుసరించుటలో లోపాలకు గాను ఆర్బిఐ విధించిన నగదు జరిమానా సరియైనది, సహేతుకమైనదిగా నిర్ధారించడమైనది. యోగేష్ దయాల్ చీఫ్ జనరల్ మేనేజర్ పత్రికా ప్రకటన: 2023-2024/1914 |