ఒడిశాలోని అంగుల్ యునైటెడ్ సెంట్రల్ కో–ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్‌పై ద్రవ్య జరిమానా విధించిన ఆర్.బి.ఐ - ఆర్బిఐ - Reserve Bank of India
ఒడిశాలోని అంగుల్ యునైటెడ్ సెంట్రల్ కో–ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్‌పై ద్రవ్య జరిమానా విధించిన ఆర్.బి.ఐ
ఒడిశాలోని అంగుల్ యునైటెడ్ సెంట్రల్ కో–ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) 2024 జూన్ 03న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా లక్ష రూపాయల ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. “మీ వినియోగదారున్ని తెలుసుకోండి(KYC) మార్గదర్శకాలు, 2016’ విషయంలో ఆర్.బి.ఐ జారీ చేసిన మాస్టర్ డైరెక్షన్‌కు ” కట్టుబడి ఉండటంలో బ్యాంకు విఫలమైనట్లు గుర్తించడంతో ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్ 47A(1)(c) కింద ఆర్.బి.ఐకి కల్పించబడిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా వేసింది. 2023 మార్చి 31 నాటికి ఉన్న బ్యాంకు ఆర్థిక స్థితిని పరిగణనలోకి తీసుకున్న నేషనల్ బ్యాంకు ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(NABARD), ఆ బ్యాంకుపై చట్టబద్ధమైన తనిఖీ నిర్వహించింది. ఈ తనిఖీలో పైన పేర్కొన్న మార్గదర్శకాలను పాటించలేదని గుర్తించడంతో పాటు సంబంధిత ఇతర నిర్ధారణల ఆధారంగా.. ఆర్.బి.ఐ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైనందుకు ఎందుకు ద్రవ్య జరిమానా విధించకూడదో తెలుపాలంటూ బ్యాంకుకు షోకాజు నోటీసు జారీ చేయడమైంది. షోకాజు నోటీసుకు బ్యాంకు ఇచ్చిన ప్రత్యుత్తరం, వ్యక్తిగత విచారణ సమయంలో బ్యాంకు మౌఖికంగా తెలిపిన సమాధానం, అదనపు సమర్పణలను పరిగణనలోకి తీసుకున్న ఆర్.బి.ఐ.. కేవైసీ అప్‌డేట్‌ను కాలానుగుణంగా చేపట్టేందుకు రిస్క్ ఆధారిత విధాన వ్యవస్థను అమలు చేయడంలో బ్యాంకు విఫలమైందని గుర్తించింది. దీంతో, అంగుల్ యునైటెడ్ సెంట్రల్ కో–ఆపరేటివ్ బ్యాంకుపై ద్రవ్య జరిమానా విధించదగినదేనని రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.ఆర్.బి.ఐ తీసుకున్న ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలోలోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు. ఈ ద్రవ్య జరిమానా విధింపు బ్యాంకుపై ఆర్.బి.ఐ తీసుకునే మరే ఇతర చర్యలకు పక్షపాత ధోరణిగా ఉండదు.
(పునీత్ పాంచోలి) పత్రికా ప్రకటన: 2024-2025/468 |