RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

129247713

ది బ్యాంకు ఎంప్లాయూస్ సహకార బ్యాంకు లిమిటెడ్, పశ్చిమ బెంగాల్ పై భారతీయ రిజర్వు బ్యాంకు వారిచే ఆర్ధిక జరిమానా విధింపు

కే.వై.సి నిబంధనలపై 2016 లో రిజర్వు బ్యాంకు వారు జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు ది బ్యాంకు ఎంప్లాయూస్ సహకార  బ్యాంకు లిమిటెడ్, పశ్చిమ బెంగాల్ పై భారతీయ రిజర్వు బ్యాంకు  తమ ఉత్తర్వు తేది 26 జూన్ ,2024  ద్వారా  రు.1.00 లక్ష ( అక్షరాల ఒక లక్ష రూపాయలు మాత్రమె ) ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధించింది. బ్యాంకింగ్   రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 (1) (సి) మరియు సెక్షన్ 46(4)() మరియు సెక్షన్ 56 ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి  రిజర్వు బ్యాంకు జరిమానా ను విధించడమైనది.

బ్యాంకులో 31 మార్చ్ 2023 ఆర్ధిక పట్టికల ఆధారంగా భారతీయ  రిజర్వు బ్యాంకు చట్టబద్ధ తనిఖీ నిర్వహించారు. తనిఖీ లో బ్యాంకు, చట్టపరముగా పాటించవలసిన  విధి విధానాలను/భారతీయ రిజర్వు బ్యాంకు ఆదేశాలను పాటించలేదని గమనించి, బ్యాంకుపై జరిమానా ఎందుకు విధించకూడదో వివరణ ఇవ్వవలసినదిగా నోటీసు ఇవ్వడమైనది. బ్యాంకు సమర్పించిన వివరణ పరిశీలించిన మీదట, వ్యక్తిగత మౌఖిక విచారణ లో వాదన విన్నమీదట,రిజర్వు బ్యాంకు వారు సూచించిన చట్టబధ్దమైన ఆదేశాల (రిస్క్ ఆధారముగా  బ్యాంకు ఖాతాల వర్గీకరణ పై కాలానుగుణ సమీక్ష జరగలేదనే)  ఉల్లంఘన జరిగిందని నిర్ధారించుకుని బ్యాంకు పై ఆర్ధిక జరిమానాను విధించడమైనది.

చర్య భారతీయ రిజర్వు బ్యాంకు నియంత్రణ అనుపాలనల లోపాలపై ఆధారపడి తీసుకున్నదే తప్ప, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా అన్వయించుకోరాదు. మరియు, ఆర్ధిక జరిమానా విధించడం వలన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు పై భారతీయ రిజర్వు బ్యాంకు తీసుకునే ఇతర చర్య పై ప్రతికూల ప్రభావం చూపదు.

(పునీత్ పంచోళీ )       

చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన : 2024-2025/605

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?