RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

104375987

ది బంట్రా సహకార బ్యాంక్ లిమిటెడ్, హౌరా, పశ్చిమ బెంగాల్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా ద్రవ్య జరిమానా విధింపు

తేది: 02/05/2023

ది బంట్రా సహకార బ్యాంక్ లిమిటెడ్, హౌరా, పశ్చిమ బెంగాల్ పై
భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా ద్రవ్య జరిమానా విధింపు

భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ఏప్రిల్ 26, 2023 నాటి ఆదేశం ద్వారా, ది బంట్రా సహకార బ్యాంక్ లిమిటెడ్, హౌరా, పశ్చిమ బెంగాల్ (ది బ్యాంకు) పై 30,000/-(రూ. ముప్పై వేలు మాత్రమే) జరిమానా విధించింది. నగర సహకార బ్యాంకులకు ఆర్‌బిఐ జారీ చేసిన ఆదేశాలు - (i) 'ఎక్స్‌పోజర్ నిబంధనలు మరియు చట్టబద్ధమైన/ఇతర పరిమితులు - UCBలు' మరియు (ii) ‘మీ వినియోగదారుని తెలుసుకోండి (KYC) ఆదేశాలు, 2016' ల ఉల్లంఘనకు ఫై జరీమానా విధించబడింది. ఆర్‌బిఐ జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని ఈ జరిమానా విధించబడింది.

ఈ చర్య నియంత్రణ అనుపాలనల లోపాలపై ఆధారపడి తీసుకున్నదే తప్ప, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా ఉద్దేశించబడలేదు.

నేపధ్యము

మార్చి 31, 2022 నాటి ఆర్థిక స్థితి ఆధారంగా బ్యాంక్ యొక్క తనిఖీ నివేదిక, మిగతా వాటితో సహా, బ్యాంక్ దాని ఖాతాలలో ఇంటర్-బ్యాంక్, స్థూల మరియు కౌంటర్‌పార్టీ ఎక్స్‌పోజర్ పరిమితులను ఉల్లంఘించిందని మరియు రిస్క్ వర్గీకరణ యొక్క కాలానుగుణ సమీక్షను నిర్వహించడంలో విఫలమైందని వెల్లడించింది. దీని ఆధారంగా, ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంకుకు నోటీసు జారీ చేయబడింది.

బ్యాంక్ యొక్క ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని మౌఖిక సమర్పణ అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత, ఈ విషయంలో బ్యాంకు ద్వారా ఆర్‌బిఐ ఆదేశాల ఉల్లంఘన వాస్తవమని మరియు జరిమానా విధించదగినదిగా, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.

(యోగేష్ దయాల్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2023-2024/165

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?