పత్రిక ప్రకటన ది బాపట్ల పట్టణ సహకార బ్యాంకు, ఆంధ్ర ప్రదేశ్ పై భారతీయ రిజర్వు బ్యాంకు వారి ఆర్ధిక జరిమానా విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
పత్రిక ప్రకటన ది బాపట్ల పట్టణ సహకార బ్యాంకు, ఆంధ్ర ప్రదేశ్ పై భారతీయ రిజర్వు బ్యాంకు వారి ఆర్ధిక జరిమానా విధింపు
భారతీయ రిజర్వు బ్యాంకు, పట్టణ సహకార బ్యాంకులలో తమ డైరెక్టర్లకు, వారి బంధువులకు మరియు వారికి లబ్ధి చేకూరే సంస్థలకు ఇచ్చే రుణాలపై విడుదల చేసిన నిబంధనలను,బహిర్గత పరిమితి విధి విధానాలను, మీ ఖాతాదారుల గురించి తెలుసుకోండి ( కె .వై .సి) నిబంధనలను మరియు ఇతర చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించినందులకు గాను ది బాపట్ల పట్టణ సహకార బ్యాంకు, ఆంధ్ర ప్రదేశ్ పై భారతీయ రిజర్వు బ్యాంకు వారు తమ ఉత్తర్వు తేదీ 4 డిసెంబర్ 2024 ద్వారా రు.2.00 లక్షల (అక్షరాల రెండు లక్షల రూపాయలు మాత్రమే ) ఆర్ధిక జరిమానా విధించడమైనది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది. ఈ బ్యాంకులో 31 మార్చి 2023 ఆర్ధిక పట్టికల ఆధారంగా భారతీయ రిజర్వు బ్యాంకు చట్టబద్ధ తనిఖీ నిర్వహించారు. ఆ తనిఖీ లో ఈ బ్యాంకు, చట్టపరముగా పాటించవలసిన విధి విధానాలను/భారతీయ రిజర్వు బ్యాంకు ఆదేశాలను పాటించలేదని గమనించి,తత్సబంధిత పత్రములను పరిశీలించి బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము ప్రకారము పాటించనందులకు గాను ఈ బ్యాంకుపై జరిమానా ఎందుకు విధించకూడదో వివరణ ఇవ్వవలసినదిగా నోటీసు ఇవ్వడమైనది. ఈ బ్యాంకు సమర్పించిన వివరణ పరిశీలించిన మీదట, వ్యక్తిగత మౌఖిక విచారణ లో వాదన విన్నమీదట, పైన పేర్కొనబడిన అభియోగాలు వాస్తవమైనవిగా నిర్ధారించుకుని , భారతీయ రిజర్వు బ్యాంకు ఈ ఆర్ధిక జరిమానా విధించవలసి వచ్చింది. ఈ బ్యాంకు 1. తమ డైరెక్టర్లకు వారి బంధువులకు రుణాలు మంజూరు చేసింది 2. విజ్ఞతతో నిర్ణయించబడిన అంతర బ్యాంకుల స్థూల బహిర్గత పరిమితులను, కౌంటర్ పార్టీ పరిమితులను ఉల్లంఘించింది 3. కొంతమంది ఖాతాదారుల కె. వై. సి రికార్డులను నిర్ణయించబడిన గడువు లోపల సెంట్రల్ కె వై సి రికార్డుల రిజిస్ట్రీ కి పంపించలేదు. చట్టబద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరుబ్యాంకు తమఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదేవీల ప్రామాణికతలకు సంబంధించినది కాదు. ముందు ముందు ఈ బ్యాంకు పై, భారతీయ రిజర్వు బ్యాంకు తీసుకోదలచిన చర్యలకు ఈ ఆర్ధిక జరిమానా అడ్డంకి కాబోదు. (పునీత్ పంచోళీ) పత్రిక ప్రకటన : 2024-2025/1643 |