RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

113523190

RBI imposes monetary penalty on The Bavla Nagarik Sahakari Bank Ltd., Dist. Ahmedabad, Gujarat

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ జిల్లాలో గల బావ్లా నాగరిక్ సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) 2024 మే 22న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.3 లక్షల(కేవలం మూడు లక్షల రూపాయల) ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘‘డైరెక్టర్లకు, బంధువులకు, వారు ఆసక్తి ఉన్నటు వంటి సంస్థలు/అన్యసంస్థలకు రుణాలు, అడ్వాన్సులు జారీ’’, ‘‘డైరెక్టర్లకు రుణాలు మరియు అడ్వాన్సులు మొదలగునవి –ష్యూరిటీ/గ్యారంటర్లుగా డైరెక్టర్లు – స్పష్టీకరణ” మరియు ‘‘మాస్టర్ డైరెక్షన్ – మీ వినియోగదారున్ని తెలుసుకోండి(KYC) మార్గదర్శకాలు, 2016 ’’ విషయాల్లో ఆర్.బి.ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు బావ్లా నాగరిక్ సహకారి బ్యాంకు లిమిటెడ్ కట్టుబడి ఉండకపోవడంతో ఈ ద్రవ్య జరిమానాను విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్ 47A(1)(c) కింద ఆర్‌‌.బి.ఐకి కల్పించబడిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా వేసింది.

2023 మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఆర్‌‌.బి.ఐ ఆ బ్యాంకుపై చట్టబద్ధమైన తనిఖీ నిర్వహించింది. ఆర్.బి.ఐ మార్గదర్శకాలకు బ్యాంకు కట్టుబడి లేదని గుర్తించడంతో పాటు ఇతర సంబంధిత నిర్ధారణల ఆధారంగా, మార్గదర్శకాలు పాటించనందుకు బ్యాంకుపై ఎందుకు ద్రవ్య జరిమానా విధించకూడదో తెలుపాలంటూ బావ్లా నాగరిక్ సహకారి బ్యాంకుకు షోకాజు నోటీసు జారీ చేయడమైంది. నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ సందర్భంగా ఇవ్వబడిన మౌఖిక సమర్పణలు పరిగణనలోకి తీసుకున్న తదుపరి, బ్యాంక్ ద్వారా ఆర్.బి.ఐ ఆదేశాల ఉల్లంఘన జరిగిందని, కింద పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. తనిఖీ నివేదికల పరిశీలనల్లో(i) బ్యాంకు డైరెక్టర్ల బంధువులకు ఆసక్తి ఉన్న దగ్గర రుణాలు మంజూరు చేయడం/పునరుద్ధరించడం మరియు బ్యాంకు డెరెక్టర్ల బంధువులు గ్యారెంటీర్లుగా ఉన్న దగ్గర రుణాలు మంజూరు చేయడం/పునరుద్ధరించడం (ii) నిర్దేశిత కాలానికనుగుణంగా రిస్క్ ఆధారిత కేవైసీ అప్‌డేట్‌ను చేపట్టకపోవడం చేసిందని వెల్లడైంది.

ఆర్‌‌.బి.ఐ తీసుకున్న ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు. అంతేకాక, ఈ ద్రవ్య జరిమానా విధింపు బ్యాంకుపై ఆర్.బి.ఐ తీసుకునే మరే ఇతర చర్యలకు పక్షపాత ధోరణిగా ఉండదు.

(పునీత్ పాంచోలి)
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2024-2025/431

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?