RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

108874477

ది బేచరాజి నాగరిక సహకారి బ్యాంకు లిమిటెడ్,మెహ్సానా జిల్లా, గుజరాత్ పై - భారతీయ రిజర్వు బ్యాకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు

భారతీయ రిజర్వు బ్యాంకు వారు, “డిపాజిట్ల  ఖాతాల నిర్వహణ” విషయములో  ప్రాధమిక పట్టణ సహకార బ్యాంకులు, ఇతర బ్యాంకులలో  పెట్టే డిపాజిట్లపై   జారీ చేసిన నిబంధనలను  సక్రమముగా  అమలుపరచనందులకు గాను, తమ 22-08-2023 తేది నాటి ఉత్తర్వు ద్వారా ది బేచరాజి నాగరిక సహకారి బ్యాంకు లిమిటెడ్, మెహ్సానా జిల్లా,గుజరాత్ పై రు.2.00 లక్షలు  ( అక్షరాల రెండు  లక్షల రూపాయలు మాత్రమే  ) ఆర్ధిక జరిమానా (పెనాల్టీ) విధించడము జరిగింది.

బ్యాంకింగ్   రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)(  ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి  రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది.

చట్ట బద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరు  బ్యాంకు తమ ఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదీవీల ప్రామాణికతకు సంబంధించినది కాదు.

నేపధ్యము

ఈ బ్యాంకు యొక్క 31-03-2022 తేది నాటి ఆర్ధిక పరిస్థితి ప్రామాణికముగా రిజర్వు బ్యాంకు వారు చట్ట బద్ధ తనిఖీ నిర్వహించారు .ఆ నిఖీ నివేదికను,ముప్పు అంచనాల నివేదిక మరియు తత్సంబంధిత పత్రములను పరిశీలించిన మీదట, ఈ బ్యాంకుకు, ఇతర బ్యాంకుల కు మధ్య ఉండవలసిన విచక్షణా యుతంగా నిర్ణయించబడిన  కౌంటర్ పార్టీ అత్యధిక   ఆర్ధిక పరిమితులను ఉల్లంఘించినదని నిర్ధారణకు రావడం  జరిగింది    

తదనుగుణంగా,పైన పొందుపరచిన అవకతవకలు జరిగినందులకు గాను, భారతీయ రిజర్వు బ్యాంకు  ఆదేశాలు పాటించనందులకుగాను ఈ బ్యాంకుపై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వ వలసినదిగా బ్యాంకు కు నోటీసు ఇవ్వడమైనది.

ఈ బ్యాంకు సమర్పించిన వివరణ పరిశీలించిన మీదట, వ్యక్తిగత మౌఖిక విచారణ లో వాదన విన్నమీదట, రిజర్వు బ్యాంకు వారు సూచించిన చట్టబద్డమైన ఆదేశాల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించుకుని ఈ బ్యాంకు పై ఆర్ధిక పరమైన జరిమానాను విధించడమైనది . 

యోగేష్ దయాళ్
చీఫ్జ నరల్ మేనేజర్

పత్రిక ప్రకటన విడుదల 2023-24/922

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?