ది భుజ్ వాణిజ్య సహకార బ్యాంకు కచ్ జిల్లా గుజరాత్ , పై భారతీయ రిజర్వు బ్యాంకు వారిచే ఆర్ధిక జరిమానా విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
ది భుజ్ వాణిజ్య సహకార బ్యాంకు కచ్ జిల్లా గుజరాత్ , పై భారతీయ రిజర్వు బ్యాంకు వారిచే ఆర్ధిక జరిమానా విధింపు
పట్టణ సహకార బ్యాంకులు తమ డిపాజిట్లను ఇతర బ్యాంకులలో పెట్టేటప్పుడు, భారతీయ రిజర్వు బ్యాంకు, “సహకార బ్యాంకులు – డిపాజిట్లు వడ్డిరేట్లు-2016” అనే అంశం మీద ఇచ్చిన నిబంధనలను ఉల్లంఘించి నందుకు, మరియు పట్టణ సహకార బ్యాంకుల లో, భారతీయ రిజర్వు బ్యాంకు 2016 లో విడుదల చేసిన “మీ ఖాతాదారుల గురించి తెలుసుకోండి” (KYC నిబంధనలు -2016) లను ఉల్లంఘించినందులకు గాను ది భుజ్ వాణిజ్య సహకార బ్యాంకు లిమిటెడ్ , కచ్ జిల్లా, గుజరాత కచ్ జిల్లా గుజరాత్ ్ పై భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేది 23నవంబర్ ,2023 ద్వారా ఆర్ధిక రు.1.50 లక్ష ( అక్షరాల ఒక లక్ష ఏభై వేల రూపాయలు మాత్రమె ) ఆర్ధక జరిమానా ( పెనాల్టీ ) విధించింది బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)( ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది చట్టబద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరుబ్యాంకు తమఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదే వీల ప్రామాణికతలకు సంబంధించినది కాదు . నేపధ్యము ఈ బ్యాంకు యొక్క 31-03-2022 తేది నాటి ఆర్ధిక పరిస్థితి ప్రామాణికముగా రిజర్వు బ్యాంకు వారు చట్ట బద్ధ తనిఖీ నిర్వహించారు .ఆ తనిఖీ నివేదికను,ముప్పు(రిస్క్) అంచనాల నివేదిక మరియు తత్సంబంధిత పత్రములను పరిశీలించిన మీదట బహిర్గతమైన అంశము . నిర్దుష్ట కాల పరిమితులలో ఖాతాలను రిస్క్ ఆధారంగా(లో, మీడియం, హై కేటగిరీలలో ) వర్గీకరించే విధానాన్ని బ్యాంకులో అమలు చేయక పోవుట, కరెంటు ఖాతాలు కాకుండా వడ్డీ చెల్లించకుండా వుండే డిపాజిట్ ఖాతాలను తీసుకోవడము , ఈ విషయములో భారతీయ రిజర్వు బ్యాంకు ఆదేశాలు పాటించనందులకుగాను ఈ బ్యాంకుపై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వ వలసినదిగా బ్యాంకు కు నోటీసు ఇవ్వడమైనది. ఈ బ్యాంకు సమర్పించిన వివరణ పరిశీలించిన మీదట, వ్యక్తిగత మౌఖిక విచారణ లో వాదన విన్నమీదట,రిజర్వు బ్యాంకు వారు సూచించిన చట్టబధ్దమైన ఆదేశాల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించుకుని ఈ బ్యాంకు పై ఆర్ధిక పరమైన జరిమానాను విధించడమైనది.
యోగేష్ దయాళ్ చీఫ్ జనరల్ మేనేజర్ పత్రికా ప్రకటన 2023-2024/1612 |