RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

103374611

భుజ్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అహ్మదాబాద్ (గుజరాత్)పై భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా ద్రవ్య జరిమానా విధింపు

తేది: 19/12/2022

భుజ్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అహ్మదాబాద్ (గుజరాత్)పై
భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా ద్రవ్య జరిమానా విధింపు

భుజ్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అహ్మదాబాద్ (గుజరాత్), 'డైరెక్టర్లు మొదలైన వారికి రుణాలు మరియు అడ్వాన్సులు- డైరెక్టర్లు ష్యూరిటీ/గ్యారంటర్లుగా- స్పష్టీకరణ' మరియు 'మాస్టర్ సర్క్యులర్ - అడ్వాన్స్‌ల నిర్వహణ నిబంధనలపై UCBలకు భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) జారీ చేసిన ఆదేశాలను పాటించనందుకు/ఉల్లంఘించినందుకు, RBI తన డిసెంబర్ 14, 2022 నాటి ఉత్తర్వు ద్వారా బ్యాంకుపై రూ.7.00 లక్షలు (రూ. ఏడు లక్షల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. RBI జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని, ఈ జరిమానా విధించబడింది.

ఈ చర్య నియంత్రణ అనుపాలనల లోపాలపై ఆధారపడి తీసుకున్నదే తప్ప, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా భావించరాదు.

నేపధ్యము

బ్యాంక్ యొక్క మార్చి 31, 2021 నాటి ఆర్థిక స్థితి ఆధారంగా చేపట్టిన తనిఖీ నివేదిక మరియు దానికి సంబంధించిన రిస్క్ అసెస్‌మెంట్ నివేదిక మరియు సంబంధిత ఉత్తర ప్రత్యుత్తరాల పరిశీలనలో, మిగతావాటితో కలిపి, RBI జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలకు విరుద్దంగా బ్యాంక్ ముప్పై ఐదు రుణాలను మంజూరు చేసింది, అందులో దాని డైరెక్టర్ల బంధువులు పూచీకత్తు/గ్యారంటర్‌గా ఉన్నారు మరియు మంజూరు చేయబడిన కొన్ని రుణాల ముగింపు వినియోగాన్ని పర్యవేక్షించలేదు. దీని ఆధారంగా, RBI జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంకుకు నోటీసు జారీ చేయబడింది.

బ్యాంక్ యొక్క ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత, ఈ విషయంలో బ్యాంకు ద్వారా RBI ఆదేశాల ఉల్లంఘన వాస్తవమని మరియు జరిమానా విధించదగినదిగా, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.

(యోగేష్ దయాల్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2022-2023/1402

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?