పత్రికా ప్రకటన కాథలిక్ సహకార పట్టణ బ్యాంక్ లిమిటెడ్, తెలంగాణ పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
పత్రికా ప్రకటన కాథలిక్ సహకార పట్టణ బ్యాంక్ లిమిటెడ్, తెలంగాణ పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు
“డిపాజిట్ ఖాతాల నిర్వహణ -ప్రాథమిక (అర్బన్) సహకార బ్యాంకులు’, అడ్వాన్స్‌ల నిర్వహణ-UCBలు మరియు డైరెక్టర్లకు, బంధువులకు, వారికి ప్రమేయం ఉన్న వ్యాపార సంస్థలు/స్తాపనలకు ఋణాలు మరియు అడ్వాన్సులకు” సంబంధించి ఆర్బీఐ రూపొందించిన మార్గనిర్ధేశాలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా అక్టోబర్ 07, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా కాథలిక్ సహకార పట్టణ బ్యాంక్ లిమిటెడ్, తెలంగాణ, (బ్యాంక్), వారి పై రూ.3 లక్షలు (మూడు లక్షల రూపాయలు మాత్రమే) ద్రవ్య జరిమానా విధించడమైనది. అక్టోబర్, 2023 న ఆర్బిఐ జరిపిన సమగ్ర పరిశీలన ద్వారా బ్యాంకు ఆర్బిఐ ఆదేశాలను పాటించకపోవడం మరియు దానికి సంబంధించిన అన్ని ప్రత్యుత్తరాల పర్యవేక్షక నిర్ధారణల ఆధారంగా, రిజర్వ్ బ్యాంక్ పేర్కొన్న నియమాలను అనుసరించుటలో విఫలమైనందుకు బ్యాంకు పై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది. భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటీసుకు బ్యాంకు వారి వివరణ పరిశీలించిన తరువాత, మరియు బ్యాంకుతో సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ పరిగణించిన పిమ్మట, దిగువ పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలను అనుసరించుటలో లోపాలకు గాను ఆర్బిఐ విధించిన నగదు జరిమానా సరియైనది, సహేతుకమైనదిగా నిర్ధారించడమైనది. ఈ బ్యాంకు: (i) నిర్దిష్ట డిపాజిట్ ఖాతాలలో కార్యకలాపాలను పర్యవేక్షించలేదు మరియు ఆ ఖాతాలలో బ్యాలెన్స్ లేకున్నప్పటికీ (బ్యాలెన్స్) నిల్వ నిర్ధారణ లేఖలను జారీ చేసింది. (పునీత్ పంచోలీ) చీఫ్ జనరల్ మేనేజర్ Press Release: 2024-2025/1324 |