RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

108878852

చప్పి నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, భనాస్కాంత, గుజరాత్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

‘డైరెక్టర్లకు, బంధువులకు, వారికి సంబంధించిన వ్యాపార సంస్థలకు/స్థాపనలకు ఋణాలు మరియు అడ్వాన్సుల” కు సంబంధించి ఆర్బీఐ రూపొందించిన మార్గనిర్ధేశాలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A (1)(c) తో పాటు 46 (4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా సెప్టెంబర్ 18, 2023 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా చప్పి నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, భనాస్కాంత, గుజరాత్ వారి పై ₹1 లక్ష (ఒక లక్ష రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి లావాదేవిలతో గానీ, ఒప్పందాల చెల్లుబాటు విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు.

నేపథ్యం:

మార్చి 31, 2022 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి ఆర్బిఐ చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది.  ఈ చర్యలో భాగంగా తనిఖీల నివేదిక, రిస్క్ అంచనా నివేదిక మరియు దానికి సంబంధించిన అన్ని ప్రత్యుత్తరాల సమగ్ర పరిశీలన ద్వారా బ్యాంకు డైరెక్టర్లలో ఒకరి బంధువుకు ఋణ సౌకర్యం కల్పించబడిందన్న విషయం వెల్లడైనది. ఆర్బిఐ రూపొందించిన విదివిధానాలను మరియు నిర్దేశాలను అనుసరించుటలో వైఫల్యం కారణంగా బ్యాంకు పై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది.

భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటీసుకు బ్యాంకు వారి వివరణ పరిశీలించిన తరువాత, మరియు బ్యాంకుతో సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ పరిగణించిన పిమ్మట, లోగడ పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలను అనుసరించుటలో లోపాలకు గాను ఆర్బిఐ విధించిన నగదు జరిమానా సరియైనది, సహేతుకమైనదిగా నిర్ధారించడమైనది.

(యోగీష్ దయాళ్)     
ముఖ్య నిర్వహణ అధికారి

పత్రికా విడుదల: 2023-2024/1144

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?