కర్ణాటక రాష్ట్రం లోని చిత్ర దుర్గ నగరానికి చెందిన "ది చిత్రదుర్గ డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్. - ఆర్బిఐ - Reserve Bank of India
కర్ణాటక రాష్ట్రం లోని చిత్ర దుర్గ నగరానికి చెందిన "ది చిత్రదుర్గ డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్.
"మోసాలు - వర్గీకరణ, నివేదన మరియు పర్యవేక్షణ" కు సంబంధించి నాబార్డ్ జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల కర్ణాటక రాష్ట్రం లోని చిత్ర దుర్గ నగరానికి చెందిన "ది చిత్రదుర్గ డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంకు 16-04-2024 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 50,000 (యాభై వేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 లోని 47A (i)(C), 46(4)(i) మరియు 56 విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొంటూ ఈ అపరాధ రుసుమును విధించింది. ఈ బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిగతులపై 31-03-2023 తేదీన భారతీయ రిజర్వ్ బ్యాంకు చట్టబద్ధమైన విచారణ జరిపింది. నాబార్డ్ రూపొందించిన మార్గ నిర్దేశకాలను సదరు బ్యాంక్ పాటించనట్లు గుర్తించి ఈ విషయంలో సదరు బ్యాంక్ తో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల ఆధారంగా సదరు బ్యాంకు పై ఎందుకు చర్య తీసుకోకూడదో వివరించాలంటూ బ్యాంకుకు ఒక నోటీసును జారీ చేసింది. ఈ నోటీసుకు బ్యాంకు వారు పంపిన ప్రత్యుత్తరము, దాఖలు పరచిన అదనపు సమాచారము మరియు జరిపిన వ్యక్తిగత విచారణల ఆధారంగా సదరు బ్యాంక్ లో జరిగిన మోసాలను నాబార్డ్ కు నివేదించటంలో జరిగిన ఆలస్యాన్ని నిర్ధారించి అపరాధ రుసుమును విధించింది. నియమ నిబంధనలను సరిగా పాటించని కారణంగా ఈ చర్య తీసుకోబడింది. అంతే కానీ బ్యాంకు యొక్క ఖాతాదారులు జరుపుతున్న లావాదేవీలు, ఒప్పందాలపై ఈ చర్య ఎటువంటి ప్రభావము చూపదు. అపరాధ రుసుము విధించినప్పటికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ సదరు బ్యాంక్ పైన మరేదైనా చర్య తీసుకొనే అధికారం కలిగి వుంటుంది.
(యోగీష్ దయాళ్) ముఖ్య నిర్వహణ అధికారి పత్రికా విడుదల: 2024-2025/210 |