<font face="mangal" size="3">ది సిటిజన్స్’ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్,  - ఆర్బిఐ - Reserve Bank of India
ది సిటిజన్స్’ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, జమ్మూ, జమ్మూ మరియు కాశ్మీర్ పై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ద్రవ్య జరిమానా విధింపు
జనవరి 16, 2023 ది సిటిజన్స్’ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, జమ్మూ, జమ్మూ మరియు భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) జనవరి 06, 2023 నాటి తమ ఉత్తర్వు ద్వారా, “బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 35 A మరియు సెక్షన్ 36(1)(a) తో కలిపి సెక్షన్ 56 లోని నిబంధనలను ఉల్లంఘించినందులకు, ది సిటిజన్స్’ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, జమ్మూ, జమ్మూ మరియు కాశ్మీర్ (‘బ్యాంక్’) పై ₹5.00 లక్షల (అక్షరాలా ఐదు లక్షల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. RBI జారీ చేసిన పై ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని RBI ద్వారా ఈ జరిమానా విధింపబడింది. ఈ చర్య నియంత్రణ అనుపాలన లోని లోపాలపై ఆధారపడి తీసుకున్నదే గాని, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే వొక అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు. నేపథ్యo బ్యాంక్ యొక్క మార్చి 31, 2020 నాటి ఆర్థిక స్థితి ఆధారంగా చేపట్టిన తనిఖీ నివేదిక, మిగతావాటితో కలిపి, సూపర్వైజరీ యాక్షన్ ఫ్రేమ్‌వర్క్ (SAF) క్రింద సింగిల్ మరియు గ్రూప్ రుణగ్రహీత ఎక్స్పోజర్ పరిమితిని తగ్గించడంపై RBI ద్వారా బ్యాంక్ కు జారీ చేయబడిన నిర్దిష్ట ఆదేశాల వైఫల్యాన్ని మరియు ఉల్లంఘనలను వెల్లడించింది. దీని ఆధారంగా, పైన ఉటంకించిన ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంక్ కు వొక నోటీసు జారీ చేయబడింది. నోటీసు కు బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరములు, మరియు ఇవ్వబడిన అదనపు సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్న తదుపరి, బ్యాంక్ ద్వారా RBI ఆదేశాల ఉల్లంఘన జరిగిందని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2022-2023/1555 |