ది సిటిజెన్స్ సహకార బ్యాంకు లిమిటెడ్ జమ్మూ పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక పెనాల్టి విధింపు. - ఆర్బిఐ - Reserve Bank of India
ది సిటిజెన్స్ సహకార బ్యాంకు లిమిటెడ్ జమ్మూ పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక పెనాల్టి విధింపు.
పట్టణ సహకార బ్యాంకులలో పర్యవేక్షక చర్యల విధానములను గురించి భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన నిబంధనలను ఉల్లంఘించినందుకు, మరియు బహిర్గత పరిమితులను,చట్టబద్ధమైన ఇతర ఆంక్షలను ఉల్లంఘించినందులకు గాను ది సిటిజెన్స్ సహకార బ్యాంకు లిమిటెడ్ జమ్మూ పై భారతీయ రిజర్వు బ్యాంకు, తమ ఉత్తర్వు తేది 22/08/2023 ద్వారారు.6.00 లక్షల (అక్షరాల ఆరు లక్షల రూపాయలు మాత్రమె )జరిమానా విధించినది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)( ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది. చట్టబద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరుబ్యాంకు తమఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదీవీల ప్రామాణికతకు సంబంధించినది కాదు. నేపధ్యము ఈ బ్యాంకు యొక్క 31-03-2022 తేది నాటి ఆర్ధిక పరిస్థితి ప్రామాణికముగా రిజర్వు బ్యాంకు వారు చట్ట బద్ధ తనిఖీ నిర్వహించారు .ఆ తనిఖీ నివేదికను,ముప్పు(రిస్క్) అంచనాల నివేదిక మరియు తత్సంబంధిత పత్రములను పరిశీలించిన మీదట బహిర్గతమైన అంశాలు(i) భారతీయ రిజర్వు బ్యాంకు విడుదల చేసిన పర్యవేక్షక చర్యల విధానములను ఉల్లంఘించి కొత్త రుణాలు మంజూరు చేయుట ,క్యాష్ క్రెడిట్ సౌకర్యమును పరిమితికి మించి అనుమతించుట (ii) వివేచనతో పెట్టిన అంతర బ్యాంకుల స్థూల బహిర్గత పరిమితుల ఉల్లంఘన,మరియు అంతర బ్యాంకుల కౌంటర్ పార్టి బహిర్గత పరిమితులను ఉల్లంఘించుట. తదనుగుణంగా,పైన పొందుపరచిన అవకతవకలు జరిగినందులకు గాను భారతీయ రిజర్వు బ్యాంక్ నిబంధనలను ఉల్లంఘించినందులకు కు గాను వివరణ ఇవ్వ వలసినదిగా బ్యాంకు కు నోటీసు ఇవ్వడమైనది. ఈ బ్యాంకు సమర్పించిన వివరణ పరిశీలించిన మీదట, వ్యక్తిగత మౌఖిక విచారణ లో వాదన విన్నమీదట,రిజర్వు బ్యాంకు వారు సూచించిన చట్టబద్డమైన ఆదేశాల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించుకుని ఈ బ్యాంకు పై ఆర్ధిక పరమైన జరిమానాను విధించడమైనది.
శ్వేత శర్మ పత్రిక ప్రకటన 2023-2024/954 |