RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

108887096

ది మెహ్సానా సహకార బ్యాంకు లిమిటెడ్ మెహ్సానా గుజరాత్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక పెనాల్టి విధింపు.

పట్టణ సహకార బ్యాంకుల లో తమ డైరెక్టర్లకు ఇవ్వదలచిన రుణాల విషయములోను, డైరెక్టర్లు హామీదారులుగా/ష్యూరిటిదారులుగా వున్నప్పుడు, డైరెక్టర్ల బంధువులకు లాభాపేక్ష వున్నసంస్థలకు రుణాలు ఇచ్చేటప్పుడు, భారతీయ రిజర్వు బ్యాంకు చే జారి చేయబడిన నిబంధనలను ఉల్లంఘించి నందులకు, పట్టణ సహకార బ్యాంకులు తమ డిపాజిట్లను ఇతర బ్యాంకులలో పెట్టేటప్పుడు పాటించవలసిన నిబంధనలను ఉల్లంఘించి నందులకు భారతీయ రిజర్వు బ్యాంకు, తమ ఉత్తర్వు తేది 22/08/2023 ద్వారారు.3.50 లక్షల (అక్షరాల మూడు  లక్షల ఏభై వేల రూపాయలు మాత్రమె)జరిమానా విధించినది.

బ్యాంకింగ్   రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)(  ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి  రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది.

చట్టబద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరుబ్యాంకు తమఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదీవీల ప్రామాణికతకు సంబంధించినది కాదు.

నేపధ్యము

ఈ బ్యాంకు యొక్క 31-03-2022 తేది నాటి ఆర్ధిక పరిస్థితి ప్రామాణికముగా రిజర్వు బ్యాంకు వారు చట్ట బద్ధ తనిఖీ నిర్వహించారు .ఆ తనిఖీ నివేదికను,ముప్పు(రిస్క్) అంచనాల నివేదిక మరియు తత్సంబంధిత పత్రములను పరిశీలించిన మీదట బహిర్గతమైన అంశాలు(i) బ్యాంకు కు చెందిన ఒక  డైరెక్టరు యొక్క బంధువు హామీదారుడుగా  బ్యాంకు రుణాలు మంజూరు చేసింది (ii) అంతర బ్యాంకుల కౌంటర్ పార్టి బహిర్గత పరిధిని ఉల్లంఘించింది.

తదనుగుణంగా,పైన పొందుపరచిన అవకతవకలు జరిగినందులకు గాను  భారతీయ రిజర్వు బ్యాంక్ నిబంధనలను ఉల్లంఘించినందులకు కు గాను  వివరణ ఇవ్వ వలసినదిగా బ్యాంకు కు నోటీసు ఇవ్వడమైనది.

ఈ బ్యాంకు సమర్పించిన వివరణ పరిశీలించిన మీదట, వ్యక్తిగత మౌఖిక విచారణ లో వాదన విన్నమీదట,రిజర్వు బ్యాంకు వారు సూచించిన చట్టబద్డమైన ఆదేశాల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించుకుని ఈ బ్యాంకు పై ఆర్ధిక పరమైన జరిమానాను విధించడమైనది. 

యోగేష్ దయాళ్
చీఫ్జ నరల్ మేనేజర్

పత్రిక ప్రకటన 2023-2024/941

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?