RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

128941170

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గల ‘ది కో–ఆపరేటివ్ బ్యాంకు ఆఫ్ రాజ్‌కోట్ లిమిటెడ్‌’పై ద్రవ్య జరిమానా విధించిన ఆర్‌‌.బి.ఐ

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గల ‘ది కో–ఆపరేటివ్ బ్యాంకు ఆఫ్ రాజ్‌కోట్ లిమిటెడ్‌’పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) 2024 ఆగస్టు 9న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.8 లక్షల (ఎనిమిది లక్షల రూపాయల) ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘డిపాజిటర్లకు వడ్డీ రేటు’, ‘మాస్టర్ డైరెక్షన్ – మీ వినియోగదారున్ని తెలుసుకోండి(KYC) మార్గదర్శకాలు, 2016’  విషయాల్లో ఆర్.బి.ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి లేకపోవడంతో ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్ 47A(1)(c) కింద ఆర్‌‌.బి.ఐకి కల్పించబడిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా వేసింది.2023 మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఆర్‌‌.బి.ఐ, ఆ బ్యాంకుపై చట్టబద్ధమైన తనిఖీ నిర్వహించింది. ఆర్.బి.ఐ మార్గదర్శకాలకు బ్యాంకు కట్టుబడి లేదని గుర్తించడంతో పాటు ఇతర సంబంధిత నిర్ధారణల ఆధారంగా, తాము పేర్కొన్న మార్గదర్శకాలను పాటించనందుకు ఎందుకు బ్యాంకుపై ద్రవ్య జరిమానా విధించకూడదో తెలుపాలంటూ ‘ది కో–ఆపరేటివ్ బ్యాంకు ఆఫ్ రాజ్‌కోట్ లిమిటెడ్‌’కు షోకాజు నోటీసు జారీ చేసింది. నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ సందర్భంగా ఇవ్వబడిన మౌఖిక సమర్పణలు పరిగణనలోకి తీసుకున్న తదుపరి, కింద పేర్కొన్న అభియోగాలు వాస్తవమని, మార్గదర్శకాల ఉల్లంఘన జరిగిందని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. బ్యాంకు (i) ఆదాయపు పన్ను చట్టం, 1961 కింద ఆదాయపు పన్ను చెల్లింపు నుంచి పూర్తిగా మినహాయింపు పొందని 37 సంస్థల పొదుపు బ్యాంకు ఖాతాలను నిర్వహించింది (ii) నిర్దేశిత కాలానుగుణంగా రిస్క్ ఆధారంగా కేవైసీ అప్‌డేట్‌ ప్రక్రియను చేపట్టలేదని తేలింది.ఆర్‌‌.బి.ఐ తీసుకున్న ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు. అంతేకాక, ఈ ద్రవ్య జరిమానా విధింపు బ్యాంకుపై ఆర్.బి.ఐ తీసుకునే మరే ఇతర చర్యలకు పక్షపాత ధోరణిగా ఉండదు.

(పునీత్ పాంచోలి)
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన : 2024‌‌ - 2025/954

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?