ది పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్ పర్లేఖముండి ఓడిస్సా , పై భారతీయ రిజర్వు బ్యాంకు వారిచే ఆర్ధిక జరిమానా విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
ది పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్ పర్లేఖముండి ఓడిస్సా , పై భారతీయ రిజర్వు బ్యాంకు వారిచే ఆర్ధిక జరిమానా విధింపు
పరపతి సమాచార సభ్యత్వము కంపెనీలు (CIC),మరియు బహిర్గత పరిమితులపై , పట్టణ సహకార బ్యాంకులకు భారతీయ రిజర్వు బ్యాంకు వారిచ్చిన ఆంక్షలను, చట్టబద్ధమైన ఇతర ఆంక్షలను, ఉల్లంఘించినందులకు గాను ది పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్ పర్లేఖముండి ఓడిస్సా , పై భారతీయ రిజర్వు బ్యాంకు, తమ ఉత్తర్వు తేది 07/12/2023 ద్వారారు.1.50 లక్షల (అక్షరాల ఒక లక్ష ఏభై వేల రూపాయలు మాత్రమె )జరిమానా విధించినది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)( ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది. చట్టబద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరుబ్యాంకు తమఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదీవీల ప్రామాణికతకు సంబంధించినది కాదు. నేపధ్యము ఈ బ్యాంకు యొక్క 31-03-2022 తేది నాటి ఆర్ధిక పరిస్థితి ప్రామాణికముగా రిజర్వు బ్యాంకు వారు చట్ట బద్ధ తనిఖీ నిర్వహించారు .ఆ తనిఖీ నివేదికను,ముప్పు(రిస్క్) అంచనాల నివేదిక మరియు తత్సంబంధిత పత్రములను పరిశీలించిన మీదట బహిర్గతమైన అంశాలు .i) పరపతి సమాచార కంపెనీలకు పరపతి సమాచారమును పంపకపోవుట,ii) అంతర బ్యాంకుల స్థూల బహిర్గత పరిమితిని ఉల్లంఘించుట iii) విజ్ఞతతో నిర్ణయించబడిన అంతర బ్యాంకుల కౌంటర్ పార్టీ పరిమితిని ఉల్లంఘించుట. తదనుగుణంగా,పైన పొందుపరచిన అవకతవకలు జరిగినందులకు గాను భారతీయ రిజర్వు బ్యాంక్ వారి నిబంధనలను ఉల్లంఘించినందులకు కు గాను వివరణ ఇవ్వ వలసినదిగా సదరు బ్యాంకు కు నోటీసు ఇవ్వడమైనది. ఈ బ్యాంకు సమర్పించిన వివరణ పరిశీలించిన మీదట, వ్యక్తిగత మౌఖిక విచారణ లో వాదన విన్నమీదట,రిజర్వు బ్యాంకు వారు సూచించిన చట్టబద్డమైన ఆదేశాల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించుకుని ఈ బ్యాంకు పై ఆర్ధిక పరమైన జరిమానాను విధించడమైనది. యోగేష్ దయాళ్ చీఫ్ జనరల్ మేనేజర్ పత్రిక ప్రకటన :2023-2024/1616 |