RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

108877174

గుజరాత్ రాష్ట్రంలోని సురేంద్ర నగర్ జిల్లా ధ్రన్ గద్రా పట్టణం నందలి "ది ధ్రన్ గద్రా పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్

'ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల ద్వారా ఇతర బ్యాంకుల ధరావత్తు సేకరణ' కు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్ రాష్ట్రంలోని సురేంద్ర నగర్ జిల్లా ధ్రన్ గద్రా పట్టణం నందలి "ది ధన్ గద్రా పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ 03-11-2023 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రూ 1,00,000/- (ఒక లక్ష రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం లోని 1949 లోని 47 A (1)(C), 46 (4)(I) మరియు 56 విభాగాల లోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

నియంత్రణ సమ్మతిలో జరిగిన లోపాల ఆధారంగా ఈ చర్య తీసుకోబడింది. అంతే కానీ బ్యాంకు యొక్క ఖాతాదారులు జరుపుతున్న లావాదేవీలు, ఒప్పందాల పై ఈ చర్య ఎటువంటి ప్రభావం చూపదు.

నేపధ్యం

ఈ బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిగతుల పై 31-03-2022 తేదీన భారతీయ రిజర్వ్ బ్యాంకు చట్టబద్ధమైన విచారణ జరిపింది. విచారణ నివేదిక, బాధక అంచనా నివేదిక మరియు దీనికి సంబంధించిన అన్ని ఇతర అంశాలను కూలంకషంగా పరిశీలించిన మీదట ఈ బ్యాంకు యొక్క లోపాలపై తగిన చర్య ఎందుకు తీసుకోనకూదదో వివరించ వలసినదిగా ఒక నోటీసును జారీ చేసింది.

ఈ నోటీసుకు బ్యాంకు వారు పంపిన ప్రత్యుత్తరము, వ్యక్తిగత సమర్పణల ఆధారంగా ఈ బ్యాంకు భారతీయ రిజర్వు బ్యాంకు రూపొందించిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించినట్లు నిర్ధారించి బ్యాంకు పై అపరాధ రుసుమును విధించింది.

(యోగీష్ దయాళ్)   
ముఖ్య నిర్వహణ అధికారి

పత్రికా విడుదల: 2023-2024/1376

 

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?