RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

128942749

తమిళనాడులోని దిండిగుల్‌లో గల దిండిగుల్ పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్‌పై ద్రవ్య జరిమానా విధించిన ఆర్.బి.ఐ

తమిళనాడులోని దిండిగుల్‌లో గల దిండిగుల్ పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్‌పై 2024 ఫిబ్రవరి 28 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.25,000(ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే) ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) ప్రకటించింది. ‘యూఎస్‌బీల ఎక్స్‌పోజర్ నిబంధనలు మరియు చట్టబద్ధమైన/ఇతర నిబంధనల’కు సంబంధించి ఆర్‌‌.బి.ఐ జారీ చేసిన కొన్ని నిబంధనలకు కట్టుబడి ఉండటంలో దిండిగుల్ పట్టణ సహకార బ్యాంకు విఫలం కావడంతో భారతీయ రిజర్వు బ్యాంకు ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్ 47A(1)(c) కింద ఆర్‌‌.బి.ఐకి కల్పించబడిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా విధించింది.

2022 మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఆర్‌‌.బి.ఐ చట్టబద్ధమైన తనిఖీ నిర్వహించింది. ఆర్‌‌.బి.ఐ మార్గదర్శకాలను పాటించకపోవడం, సంబంధిత ఇతర నిర్ధారణల ఆధారంగా, తాము జారీ చేసిన మార్గదర్శకాలను పాటించనందుకు ఎందుకు ద్రవ్య జరిమానా విధించకూడదో తెలుపాలంటూ దిండిగుల్ పట్టణ సహకార బ్యాంకుకు ఆర్.బి.ఐ షోకాజు నోటీసు జారీ చేసింది.

షోకాజు నోటీసుకు బ్యాంకు ఇచ్చిన ప్రత్యుత్తరం, వ్యక్తిగత విచారణ సమయంలో బ్యాంకు మౌఖికంగా తెలిపిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకున్న ఆర్‌‌.బి.ఐ.. నామినల్ మెంబర్లకు నిర్దేశించిన పరిమితికి మించి రుణాలు మంజూరు చేయడాన్ని కొనసాగించిందని గుర్తించింది. దీంతో, దిండిగుల్ పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్‌పై ఆర్.బి.ఐ ద్రవ్య జరిమానా విధించింది.

ఆర్‌‌.బి.ఐ తీసుకున్న ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు. ఈ ద్రవ్య జరిమానా విధింపు బ్యాంకుపై ఆర్.బి.ఐ తీసుకునే మరే ఇతర చర్యలకు పక్షపాత ధోరణిగా ఉండదు. 

                                                                                                                        

(యోగేష్ దయాళ్)

 చీఫ్ జనరల్మేనేజర్

పత్రికా ప్రకటన :2023‌‌-2024/2123

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?